ఐటీ సంస్థ యజమానులు జర భద్రం!!

Header Banner

ఐటీ సంస్థ యజమానులు జర భద్రం!!

  Wed Jan 31, 2024 10:50        Business, Profession

ఐటీ సంస్థ యజమానులు జర భద్రం!!

సీఐడీ అధికారులమంటూ ఐటీ కార్యాలయంపై దాడి చేసి, ముగ్గురు ఉద్యోగులను కిడ్నాప్ చేసి ఖాతాల్లోని డబ్బులు కాజేసిన నకిలీ అధికారుల ముఠా గుట్టును రాయదుర్గం పోలీసులు కనుగొన్నారు.

ఈ దోపిడీలో ఆ కంపెనీ పూర్వ ఉద్యోగి సూత్రధారి కాగా ఏపీకి చెందిన ఓ ఎస్సై, న్యాయవాది, ఐటీ నిపుణుడు తో కలిసి పధకం వేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ డా. వినీత్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. కర్ణాటకకు చెందిన దర్శన్ సుగుణాకరశెట్టి గచ్చిబౌలిలో AJA (అజా) పేరిట యాడ్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా అమెరికాలో ఐటీ నియామకాల నిర్వహిస్తుంటారు.

ఇక్కడ పనిచేసి మానేసిన షేక్ పేట ఓయూకాలనీ వాసి అక్కెర రంజిత్ కుమార్ (47)కు ఏపీలోని వైయస్ఆర్ జిల్లా న్యాయవాది పొలిమేర మహేంద్రకుమార్(38)తో పరిచయం ఉంది. సుగుణాకరశెట్టి నుంచి భారీగా డబ్బు కొల్లగొట్టే అవకాశం ఉందని మహేంద్రకు చెప్పాడు. అనంతరం ఇద్దరూ కర్నూలు డీఐజీ రేంజ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్సై సుజనను సంప్రదించారు. ఆయన వారికి కడపలోని అశోక్ నగర్ చిన్నచౌక్కు చెందిన ఐటీ నిపుణుడు షేక్ మహ్మద్ అబ్దుల్ ఖదీర్(33)ను పరిచయం చేశాడు. మహేందర్, ఖదీర్ తో పాటు సందీప్ కుమార్ , రఘురాజు, రాజా కలిసి ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి.. సీఐడీ అధికారులమంటూ అజా కార్యాలయంలోకి ప్రవేశించారు. గుర్తింపుకార్డులు చూపించాలని సుగుణాకరశెట్టి వారిని అడగగా ఖదీర్ తన సెల్ఫోన్లో ‘అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్స్' పేరుతో ఉన్న వాటిని చూపించాడు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అమెరికాలోని క్లైంట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో.. ఈ దాడి చేశామంటూ డైరెక్టర్ ను భయపెట్టారు. దీని నుంచి బయటపడాలంటే రూ.10 కోట్లు తమకు ముట్టజెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.2.3 కోట్లకు అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలు ఉన్నాయని బాధితుడు చెప్పాడు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామన్న ఆలోచనతో నిందితులు అక్కడి ఉద్యోగులు రవి, చేతన్, హరి పొన్నాల ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదిలీ చేయించారు.

తరువాత ఉదయం 6.30 గంటల(27వ తేదీ)కు ఆ ముగ్గురు ఉద్యోగులను మాదాపూర్ లోని బాల్కనీ హోటల్కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకొని రూ.12.5 లక్షలు తమ ఖాతాలోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ము కోసం డైరెక్టర్ కు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో వారిని వదిలేసి పారిపోయారు. దీంతో సుగుణాకరశెట్టి అదే రోజు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు 28న నిందితులను పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఈ కేసులో వీరికి సహకారం అందించిన విజయశేఖర్, రాహుల్, సుబ్బకృష్ణలతో కలిపి మొత్తం పది మంది నిందితులుగా తేలింది. ఎనిమిది మందిని అరెస్టు చేయగా ఎస్సై సుజన్, రాజా పరారీలో ఉన్నారు. వారు వినియోగించిన నాలుగు కార్లు, 16 సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #IT #ITIndustry #ITCompanies #india #USA #TeluguMigrants