అరే ఇది తెలుసా! ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం..

Header Banner

అరే ఇది తెలుసా! ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ ఉండే నగరం..

  Mon Feb 05, 2024 12:47        World

టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-2023 లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలో అత్యంత అధికంగా ట్రాఫిక్ ఉండే నగరంగా లండన్ సిటీ నిలిచింది. బ్రిటన్ లోని లండన్ మహానగరంలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే సగటున 37 నిమిషాల సమయం పడుతుందని ట్రాఫిక్ ఇండెక్స్ లో పేర్కొన్నారు. ఇక్కడ వాహనాల సగటు వేగం గంటకు 14 కిలోమీటర్లు. అత్యధిక ట్రాఫిక్ ఉండే టాప్-10 నగరాల్లో బెంగళూరు 6వ స్థానంలో, పూణే 7వ స్థానంలో ఉన్నాయి.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

బెంగళూరులో 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 28.10 నిమిషాల సమయం పడుతుందని, పూణేలో 10 కిలోమీటర్ల ప్రయాణానికి 27.50 నిమిషాల సమయం పడుతుందని వివరించింది. బెంగళూరులో వాహనాల సగటు వేగం గంటకు 18 కిలోమీటర్లు కాగా, పూణేలో వాహనాల సగటు వేగం గంటకు 19 కిలోమీటర్లు. ఇక ఈ జాబితాలో ఢిల్లీ 44, ముంబయి 54వ స్థానంలో ఉన్నాయి. మొత్తం 55 దేశాల్లోని 387 నగరాల్లో ఇన్ కార్ నేవిగేషన్ వ్యవస్థలు, స్మార్ట్ ఫోన్ ఆధారిత సమాచారాన్ని విశ్లేషించి టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ రూపొందించారు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #London #Traffic #City #TomTomTrafficIndex #News #WorldNews