ఒమన్: 62,000 పక్షులను తొలగించిన ఎన్విరాన్మెంట్ అథారిటీ!

Header Banner

ఒమన్: 62,000 పక్షులను తొలగించిన ఎన్విరాన్మెంట్ అథారిటీ!

  Tue Feb 06, 2024 05:30        Gulf News, Oman

ఒమన్: అల్ రుస్తాక్ లో 2,561 భారతీయ కాకులు, 58,888 ఇతర పక్షులతోసహా దాదాపు 61,449 ఆక్రమణ (ఇన్ వాసీవ్) పక్షులను ఎన్విరాన్మెంట్ అథారిటీ తొలగించింది. ఒమన్ సుల్తానేట్ లోని వివిధ గవర్నరేట్ లలో అథారిటీ దక్షిణ అల్ బతినా గవర్నరేట్ లోని బార్కా మరియు ముసన్నా లో పక్షులు తొలగించబడ్డాయి. విలాయత్ ఆఫ్ ముసన్నాలో 34,880 పక్షులు, బర్కాలో 26,569 పక్షులను తొలగించినట్లు దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని పర్యావరణ విభాగం పేర్కొంది. సౌత్ అల్ బతినా గవర్నరేట్ లోని పర్యావరణ విభాగం డైరెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ వ్యవస్థలోని పక్షుల సంఖ్యను తగ్గించడానికి పర్యావరణ అథారిటీ ఈ పనిని ప్రారంభించిందని తెలిపారు. ఆక్రమణ పక్షులు పర్యావరణంలో అసమతుల్యతకు కారణమవుతుందని, అవి వ్యవసాయ పంటలు, పండ్లు, ధాన్యాల పంటలను దెబ్బతీస్తాయన్నారు. ఇది ఒమన్ సుల్తానేట్ లోని ఆర్థిక వనరులు, ఆదాయ వనరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Oman #OmanNews #OmanUpdates #Muscat #MuscatNews #Gulf #GulfCountries #GulfNews #GulfUpdates #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants