దిండు లేకుండా నిద్రపోవటం వల్ల ఇన్ని ఉపయోగాలు.. అరే పేస్ బ్యూటీని పెంచుదాం!

Header Banner

దిండు లేకుండా నిద్రపోవటం వల్ల ఇన్ని ఉపయోగాలు.. అరే పేస్ బ్యూటీని పెంచుదాం!

  Thu Feb 08, 2024 13:56        Health

మనిషికి కచ్చితంగా నిద్ర ఉండాల్సిందే. నిద్రలేకుంటే చాలా సమస్యలు వస్తాయి. అయితే నిద్రపోయే సమయంలో చేసే కొన్ని తప్పులు మీకు ఇబ్బందులు తీసుకొస్తాయి. చిన్న చిన్న పొరపాట్లే కానీ భారీమూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు నిద్రించేందుకు వివిద పద్ధతులను పాటిస్తారు. కొందరు దిండు పెట్టుకుని నిద్రపోతే... మరికొందరు దిండు లేకుండా పడుకుంటారు. కొందరికి దిండు లేకుంటే మాత్రం రాత్రంతా జాగరమే అవుతుంది. కానీ ఇలా దిండు పెట్టుకుని నిద్రపోతే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మొటిమలు రాకుండా నిరోధించవచ్చు. దిండుతో నిద్రిస్తున్నప్పుడు, మీ ముఖం దిండుకు అంటుకుని ఉంటుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇది మీ ముఖంపై బ్యాక్టీరియా, మురికిని వ్యాపింపజేస్తుంది. మీ చర్మంపై మొటిమలను కలిగిస్తుంది. మొటిమలే కాకుండా ముఖంపై ముడతలు కూడా కలిగిస్తుంది. ముఖాన్ని దిండుకు నొక్కి నిద్రపోతే... అది అకాల ముడతలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునే వారు దిండు లేకుండా నిద్రపోవాలి. మీరు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే మీరు చేయవలసిన మొదటి పని దిండుతో నిద్రపోకుండా ఉండటం. ఎందుకంటే మీ వెన్ను నొప్పికి ప్రధాన కారణం మీ దిండు. మీరు దిండు లేకుండా నిద్రపోతున్నప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉంటుంది. తల కింద దింటు ఉంటే వెన్నెముక మీద ప్రభావం పడుతుంది.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Sleep #SleepingProblems #SleepWithoutPillow #SleepWithouPillowGoodForHealth