అమెరికాలో విజృంభిస్తోన్న ప్రమాదకర ప్లేగ్! జంతువుల నుంచి మనుషులకు

Header Banner

అమెరికాలో విజృంభిస్తోన్న ప్రమాదకర ప్లేగ్! జంతువుల నుంచి మనుషులకు

  Sun Feb 11, 2024 11:54        U S A

ప్రాణంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి... నాలుగు సంవత్సరాల పాటు సతమతమైంది అమెరికా. కరోనా వల్ల అత్యధిక మరణాలు నమోదైంది ఇక్కడే. సుమారు 11.96 లక్షల మంది కోవిడ్‌కు బలి అయ్యారు. పాజిటివ్ కేసుల నమోదులోనూ అమెరికాదే అగ్రస్థానం. ఇప్పుడు మరో ప్రమాదకర వ్యాధి విస్తరిస్తోంది. ఒరెగాన్ స్టేట్‌లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. 10 సంవత్సరాల తరువాత ఈ వ్యాధి మళ్లీ వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి విస్తరించడం మొదలు పెట్టడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నారు. అదే- బ్యుబోనిక్ ప్లేగ్ (Bubonic Plague). జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే లక్షణాలు ఉండటం దీని ప్రత్యేకత. మనుషుల నుంచి మనుషులకూ సోకగలదు. ఒరెగాన్‌ స్టేట్‌లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. స్థానికంగా నివసించే ఓ వ్యక్తికి తన పెంపుడు పిల్లి నుంచి ఈ ప్లేగ్ సోకినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెంట్ తెలిపింది. అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రాల్లో అధికంగా ఈ ప్లేగ్ వ్యాపిస్తుంటుంది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

2016 వరకూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. న్యూ మెక్సికో, నార్తర్న్ అరిజోనా, సదరన్ కొలరాడో, కాలిఫోర్నియా, సదరన్ ఒరెగాన్, నెవడాల్లో అప్పట్లో పలువురు ఈ వ్యాధి బారిన పడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీన్ని సమర్థవంతంగా అడ్డుకున్నామంటూ అప్పట్లో అమెరికా ప్రకటించింది కూడా. ఇప్పుడు మళ్లీ కొత్త ఒరెగాన్ స్టేట్‌లో ఇది వెలుగులోకి రావడం కలవరపాటుకు గురి చేస్తోంది. సెంట్రల్ ఒరెగాన్‌లోని డెశాటె కంట్రీలో మళ్లీ బ్యుబోనిక్ ప్లేగ్ వెలుగులోకి వచ్చినట్లు ది న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. పెంపుడు పిల్లి నుంచి సోకినట్లు డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెంట్ తెలిపింది. తీవ్ర జ్వరం, కళ్లు ఎర్రబడటం, వాపు.. వంటి లక్షణాలు అతనిలో ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్‌లో ఉంచామని, వైద్యాన్ని అందిస్తున్నామని వివరించింది.

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #USA #AmericaNews #BUBonicPlague #NewVirus #NewVirusInUSA