ప్రధాని విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్!!

Header Banner

ప్రధాని విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్న పాకిస్థాన్!!

  Wed Feb 14, 2024 05:01        Politics

నాలుగోసారి పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ (74) బాధ్యతలు చేపడతారని అంతా ఊహిస్తున్న వేళ ఈ షాకింగ్ నిర్ణయం... నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్(PML-N) పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా షహబాజ్ షరీఫ్(72)ను నామినేట్ చేసింది. దీంతో షహబాజ్ మరోసారి పాకిస్థాన్  ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధి ప్రతినిధి మారియం ఔరంగజేబు ఎక్స్(ట్విటర్)లో వివరాలు వెల్లడించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

తమ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ తన సోదరుడు షహబాజ్ షరీఫ్ను ప్రధాని పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇక నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎంఎల్-ఎన్ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన పలు రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా నవాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల పాకిస్థాన్ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pakisthan #PakisthanPM #NavazShareef