Header Banner

రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహం!!

  Wed Feb 14, 2024 06:19        Politics

భారత్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం... దాదాపు 70 శాతం జనాభా వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే కర్ణాటకలో వ్యవసాయం చేస్తున్నవారికి 45 ఏళ్లు వస్తున్నా పిల్లను ఇచ్చేందుకు ఎవరూ రావడం లేదట. దీంతో కర్నాటక రైతు సంఘాల ప్రతినిధులు వినూత్నంగా ఆలోచించారు. రైతు యువకుడ్ని చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సీఎం సిద్ధరామయ్యను రైతులు కోరారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఈ విషయాన్ని రైతు ప్రతినిధులు సీఎంకు వినతిపత్రంలో వివరించారు. ఈ నేపథ్యంలోనే రుణ మాఫీతో పాటు రైతులను పెళ్లాడే వారికి రూ.5 లక్షలు ప్రోత్సాహం ఇవ్వాలని విన్నవించారు. మరి దీనిపై సీఎం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదు. రైతును వివాహం చేసుకునే యవతికి రూ.5 లక్షల ప్రోత్సాహాక పథకం బడ్జెట్లో పెట్టాలని కోరారు.

 

 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #Karnataka #Farmers #UnMarriedFormers #Marriages