భువనేశ్వరి స్పీచ్ కు చేనేతలు షాక్!! పద్మవర్షిణి పట్టుచీర ఒక్కటి చాలు!!
Thu Feb 15, 2024 05:17 Politicsచేనేత మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి...
చేనేతల వస్త్రాలను ప్రమోట్ చేస్తా..చేనేతలకు చేయూతనిస్తా
చంద్రబాబు సీఎం అయితేనే చేనేతలకు సంక్షేమం
రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో చేనేత మహిళలు విజ్ఞతతో ఆలోచించాలి
చేనేత మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్య
ధర్మవరం: ధర్మవరం చేనేతలు తమ చేతులతో చేసే వస్త్రాలను ప్రమోట్ చేసి చేనేతలకు చేయూతనందిస్తానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాయికి ధర్మవరం పట్టు వస్త్రాలు వెళ్లడం ఏపీకి గర్వకారణమని భువనేశ్వరి అన్నారు. అదేవిధంగా శిల్పకళావైభవ పట్టుచీర ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కడం ధర్మవరం చేనేతల గొప్పతనానికి నిదర్శనమని అభినందించారు.
శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్!!
ధర్మవరం నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా రాఘవేంద్రస్వామి కళ్యాణమండపంలో నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో చేనేత మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. చేనేతలు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం ప్రారంభంలో చేనేత మహిళలు చేనేత పరిశ్రమలో వాడే పరికరాలు, ముడి పదార్థాలను భువనేశ్వరికి చూపించారు. వాటిద్వారా వస్త్రాలను ఎలా తయారు చేస్తారో భువనేశ్వరికి వివరించారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ....ధర్మవరం చేనేత చీరలకు 125 సంవత్సరాల చరిత్ర ఉంది. ధర్మవరంలో తయారుచేసే రక్షాబంధన్ చీర గురించి నాకు తెలుసు. సంపంగి చీర, పుష్పవల్లి, రంగవల్లి పట్టు చీరల గురించి నాకు తెలుసు. ధర్మవరం గొప్పదనం గురించి తెలియజేయడానికి పద్మవర్షిణి పట్టుచీర ఒక్కటి చాలు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి మొదటినుండి కృషి చేస్తున్న పార్టీ టీడీపీ.
వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!
సగం ధరకే చేనేత వస్త్రాలు తెచ్చి చేనేత రంగానికి ఊతమిచ్చిన ఘనత నా తండ్రి నందమూరి తారకరామారావుకే దక్కుతుంది. చంద్రబాబు పాలనలో చేనేతలకు గుర్తింపుకార్డులు ఇచ్చి రూ.50వేలు వరకు సబ్సిడీలు అందించి ఆదుకున్నారు. నూలుమీద సబ్సిడీని 10శాతం నుండి 40శాతానికి పెంచిన వ్యక్తి చంద్రబాబు. చేనేతలకు పనులు లేని సమయంలో భృతి ఇచ్చి ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు. 50ఏళ్లు నిండిన చేనేతలకు ప్రతినెల పెన్షన్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చేనేతలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తారు.
గతంలో చేనేతలకు చంద్రబాబు అందించిన పథకాలను పునరుద్ధరిస్తారు. చేనేతలకు ఇప్పటికే చంద్రబాబు కొన్ని హామీలు ఇచ్చారు. మగ్గం ఉన్న చేనేతలకు 200యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందిస్తారు. మరమగ్గాలు ఉన్నవారికి 500యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నారు. ముడిసరుకు కొనుగోలుకు రాయితీలతో పాటు రుణాలు మంజూరు చేస్తామని చంద్రబాబు మీకు హామీ ఇచ్చారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు అయ్యేలా చూస్తామని, కేంద్రం ఒప్పుకోకపోతే ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చేనేతలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్లను నిర్మిస్తారు. ఆత్మహత్య చేసుకున్న చేనేతల కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం అందిస్తారు.
అరే నిజమా! డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?
చేనేత పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం చాలా అవసరం. వాళ్ల సహకారం లేకపోతే చేనేత పరిశ్రమ రాణించడం కష్టం. చేనేతలంతా ధైర్యంగా ఉండండి..మీకు మంచిరోజులు రాబోతున్నాయి. నా తండ్రి, నా భర్త ఆడపిల్లలు చదువుకోవాలి, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలి అని కోరుకున్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ రెండింటినీ సాధించడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. పేదరికం అనేది ఆడపిల్లల చదువుకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిస్తున్నాం.
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం వినుకొండలో 1200మందికి కుట్టుమిషన్లు పంపిణీ చేసి శిక్షణ ఇప్పించాం. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను రాయలసీమకు తీసుకురావడం వల్ల ఇక్కడి భూముల విలువ పెరిగింది. అంతేకాకుండా అనంతపురంజిల్లాకు చంద్రబాబు కియా పరిశ్రమ తెచ్చి వేలాది ఉద్యోగాలు వచ్చేలా చేశారు. అంతేకాకుండా అనంతపురంజిల్లాలో టెక్స్ టైల్ పార్క్, ఫుడ్ పార్క్, పార్క్ మోబిస్ ఇండియా, హార్డ్ వేర్ క్లస్టర్లు, స్మార్ట్ సిటీ వంటి పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఉద్యాన పంటల హబ్ గా అనంతపురం జిల్లాను చంద్రబాబు తీర్చి దిద్దారు.
లోకేష్ ఇక్కడ పాదయాత్ర చేసే సమయంలో మిషన్ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు. అనంతపురంజిల్లాను ఆటోమొబైల్ హబ్ గా చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ జరగాలంటే రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో మహిళలు ఓటు అనే ఆయుధాన్ని దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వాడాలి. భవిష్యత్తులో చేనేత పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను..అని భువనేశ్వరి అన్నారు. చేనేత మహిళలు, మహిళా కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి స్పందించారు. భువనేశ్వరి ఆలా చేనేతల కు సంబంధించిన ప్రతి విషయం వివరించడంతో ఆనందంతో షాక్ అయ్యారు అక్కడి ప్రజలు...
కార్యక్రమాన్ని ఉద్దేశించి ధర్మవరం టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ....
రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తి చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్త, తెలుగువారంతా అయోమయానికి గురయ్యారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుపై తిరుగులేని పోరాటం చేయడంలో భువనేశ్వరి కీలకపాత్ర పోషించారు. మహిళలు, పార్టీ కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపిన వ్యక్తి భువనేశ్వరి. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను నేరుగా వచ్చి పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించడానికి భువనేశ్వరి నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ధర్మవరం చేనేతలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవాలని భువనేశ్వరి చొరవచూపినందుకు ధన్యవాదాలు. చేనేతలను అన్ని విధాలా ఆదుకున్న ఘనత చంద్రబాబుదే. రాష్ట్ర భవిష్యత్తు మారాలని భువనేశ్వరి ఏ విధంగా పట్టుదలతో కృషి చేస్తున్నారో చూసి రాష్ట్రంలోని మహిళలంతా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ఉంది.
కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద ఉద్రిక్తత!! పోలీసుల ఓవర్ యాక్షన్!!
ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను మహిళలు ఎగరేసేందుకు కంకణబద్దులు కావాలని కోరుతున్నా. చేనేతలకు అధునాతన యంత్రాలు, పరికరాలు ఇచ్చి ముందుకు నడిపిన ఘనత చంద్రబాబుది. చేనేతలను మరిన్ని నాలుగు అడుగులు ముందుకు వేయించేందుకు నారా లోకేష్ సంసిద్ధంగా ఉన్నారు. ధర్మవరంలో పాదయాత్ర చేసిన సందర్భంలో చేనేతల కష్టాలను లోకేష్ స్వయంగా తెలుసుకుని, చేనేతలకు ఏమేం చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేతల భవిష్యత్తు మారుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా...అని అన్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ....
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా భువనేశ్వరి ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ప్రకృతి విపత్తు సమయంలోనూ ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అనేక సహాయక చర్యలను భువనేశ్వరి చేపట్టి రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయాన్ని బ్యాంకు అకౌంట్లలో వేసి సరిపట్టే మార్గం ఉన్నా.. నేరుగా కార్యకర్తల ఇళ్లకే వచ్చి వారిని పరామర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి చేనేతలను చంపిన విషయాన్ని రాష్ట్రం నేటికీ మర్చిపోలేదు.
జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యను నడిరోడ్డుమీద గొంతుకోసి చంపేశారు. నేతన్న నేస్తం పథకాన్ని అరకొరగా అందిస్తూ చేనేతలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జాతీయ చేనేత దినోత్సవం రోజునే చేనేతలు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. చేనేత మహిళను అయిన నన్ను క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్సీగా చేసిన ఘనత చంద్రబాబుది. చేనేతలంటే జగన్మోహన్ రెడ్డికి చాలా చిన్న చూపు. అందుకే వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూ...చంపుతూ పేట్రేగిపోతున్నారు. చేనేతలను చిన్న చూపు చూసే జగన్ సర్కార్ చెంప చెళ్లుమనేలా చేనేతలు తమ తీర్పును రానున్న ఎన్నికల్లో ఇవ్వాలని కోరుతున్నాను...అని అన్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
#Chenetha #NaraBhuvaneswari #Chenetha #Dharmavaram ##2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.