ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై రూల్స్!! షాక్ ఇచ్చిన ఈసి

Header Banner

ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై రూల్స్!! షాక్ ఇచ్చిన ఈసి

  Fri Feb 16, 2024 04:35        Politics

ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం తప్పనిసరి

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

అమ‌రావ‌తి:- రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ ముందస్తు ఆమోదం పొందాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. జిల్లా స్థాయిలో ప్రసారం చేసే ప్రకటనలకు జిల్లా ఎంసీఎంసీ కమిటీ, రాష్ట్ర స్థాయిలో ప్రసారం చేయదలచిన ప్రకటనలకు రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు.

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!     

 గురువారం మధ్యాహ్నం రాజకీయ ప్రకటనల విషయంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయదలచిన తేదీకి కనీసం మూడు రోజుల ముందు సంబంధిత రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రాజకీయ ప్రకటనలపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని రాజకీయ పార్టీలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎంసీఎంసీ కమిటీ సభ్యులు అడిషనల్ సీఈవో కోటేశ్వరరావు, దూర దర్శన్ కేంద్రం విజయవాడ రీజినల్ న్యూస్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ జి.కొండలరావు, పీఐబీ మీడియా కమ్యూనికేషన్ ఆఫీసర్ టి. హెన్రీ రాజ్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వర రావు, కమిటీ కన్వీనర్ & డిప్యూటీ సీఈవో మల్లిబాబు మరియు రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ప్రతినిథులు తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు చూడండి:

చంద్రబాబు ఇంటి దగ్గర సందడి!! సీనియర్ నేతల మంతనాలు??

యాత్ర తరంగణి 3: దేవాలయం లోపల పాటించవలసిన కనీస నియమ నిబంధనలు

చంద్రబాబును కలిసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు! ముహూర్తం ఖరారు?

ఆటో అన్నలకు గుడ్ న్యూస్!!

 

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

 


   #ఆంధ్రప్రవాసి #ElectionCommission #2024ElectionRules #2024NoMoreJagan #BabuSuper6 #EC #ElectromicMediaRules