ఏపీ లో బర్డ్ ఫ్లూ కలకలం!! ఆ గ్రామాల్లోకి నో ఎంట్రీ!!

Header Banner

ఏపీ లో బర్డ్ ఫ్లూ కలకలం!! ఆ గ్రామాల్లోకి నో ఎంట్రీ!!

  Sat Feb 17, 2024 10:26        Politics

ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, కోవూరు మండలాల్లో వారం రోజులుగా పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించాయి. దీంతో అప్రమత్తమయిన అధికారులు మృత్యువాత పడిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి, భోపాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ల్యాబ్ కు పంపారు.

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ!!

చనిపోయిన కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ) అనే వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేశారు. ఈ వ్యాధి సోకిన చాటగొట్ల, గుమ్మలదిబ్బ గ్రామాలకు కిలో మీటరు ప్రాంతాన్ని ఇన్ఫె క్లైడ్ జోన్గా, 10 కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ ప్రాంతంగా ప్రకటించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ గ్రామాలకు కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసి, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లతో కోళ్లలో వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసి, కోళ్లలో వ్యాధి నిర్ధారణ చేస్తున్నట్లు వివరించారు.

 

మరిన్ని వార్తలు చూడండి:

అమెరికాలో భారతీయుల మరణాలు పెరిగిపోతున్న వేళ వెలుగుచూసిన దారుణం! USAలో మరో భారతీయుడు మృతి

వైసిపి నాయకుడి పిట్టలదొర వాగ్దానాలు! లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడి!     

నేడే జీఎస్ఎల్వీ-ఎఫ్ 14 ప్రయోగం!! సక్సెస్ అయితే రైతన్నకు లాభం!!

కొంతమంది వల్ల చెడ్డపేరు వస్తోంది!! నా మాటలకు కట్టుబడి ఉన్నా!! పవన్ కల్యాణ్...

 

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group

 


   #BirdFlu #AndhraPradesh #Nellore #AndhraPravasi #Pravasi