జనసేన కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి!! నామినేటెడ్ పదవులు వారికే - నారా లోకేష్ స్పష్టం
Sun Feb 18, 2024 11:12 Politicsపెందుర్తి నియోజకవర్గం వేపగుంట శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం
ఉత్తరాంధ్ర గర్జించింది. ఆ గర్జనకు ప్యాలెస్ పిల్లి ఉచ్చబోసే రోజులు త్వరలోనే రాబోతున్నాయి.
పోరాటాల పురిటిగడ్డ మన ఉత్తరాంధ్ర. జగన్ ఇన్నాళ్లూ ఇక్కడి ప్రజలతో ఓ ఆట ఆడారు. రెండు నెలలు ఓపిక పట్టండి. జగన్ తో ఫుట్ బాల్ ఆడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖను తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న ప్రాంతం విశాఖపట్నం. బాబు గారి హయాంలో విశాఖ పట్నం జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియా అయితే జగన్ గంజాయి కేపిటల్ గా విశాఖను మార్చారు.
బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ ఉంటే, జగన్ హయాంలో విశాఖ విషాద పట్టణంగా మారింది.
బాబు గారి హయాంలో రోజుకో కంపెనీ, ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్, కాండియంట్, మెడికల్ డివైసెస్ మానుఫ్యాక్చరింగ్ చేసే ఏఎం టీజర్ తీసుకువస్తే.. జగన్ రెడ్డి హయాంలో భూకబ్జాలు, కిడ్నాప్ లు, దోపిడీలు, చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయి.
జగన్ మొన్న మీటంగ్ లో వైసీపీ వాళ్లు షర్ట్ చేతులు మడత పెట్టాలని చెప్పారు. మావాళ్లు కుర్చీ మడత పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని నేనంటే... అరగంట అంబటికి కోపం వచ్చింది. అది కుర్చీ కాదు సింహాసనం అంటున్నారు.
9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారుడి మరో ప్యాలస్!! - నారా లోకేష్
నిజమే...అది సింహాసనమే. అయితే నేను చెప్పింది దాని మీద కూర్చున్న శునకం గురించి, ఆ శునకాన్ని తరిమితరిమి కొట్టే రోజులు దగ్గర్లనే ఉన్నాయని నేను చెప్పింది కరెక్టేగా అరగంట అంబటి.
ఎన్నికల ముందు నవరత్నాలు అని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నవ మోసాలు చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పుడు వీధివీధినా మద్యం అమ్ముతున్నారు. అధికారులకు టార్గెట్ లు పెట్టి మరీ పేదవారి జేబులు గుల్ల చేస్తున్నారు.
ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి మోసం చేశారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రతినెల పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారు.
అందుకే మీ కష్టాలు చూసి బాబు గారు సూపర్-6 ప్రకటించారు. సూపర్-6 కిచిడీ అని జగన్ అంటున్నారు. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు చూసి తీసుకువచ్చాం సూపర్ -6. సైకో పాలన తరిమికొట్టేందుకు తీసుకువచ్చాం. సూపర్ -6 అంటే ఆంధ్రా భోజనం, రాయలసీమ రాగి సంకటి. అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎగతాళి చేస్తున్నారు.
జగన్ ఓటమికి దేవుడు స్క్రిప్ట్ రెడీ చేశారు. వైకాపా తరపున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకడం లేదు. విశాఖ ఎంపీగా పక్క జిల్లా నుంచి ఓ మహిళను తీసుకువచ్చారు. ఒంగోలు ఎంపీగా చెవిలో పూలు పెట్టే చెవిరిడ్డిని తీసుకువచ్చారు.
నెల్లూరు ప్రజలు చీపో అన్న అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట తీసుకువచ్చారు. గుంటూరుకు తీసుకువచ్చిన క్రికెటర్ అంబటి రాయుడు పారిపోయారు. కర్నూలు ఎంపీగా సొంత మంత్రిని నిలబడమంటే నాకొద్దని బైబై జగన్ అని వెళ్లిపోయారు. తిరుపతి ఎంపీగా సొంత ఎమ్మెల్యే ఆదిమూలంను నిలబడాలంటే బైబై అని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి.
ఎన్నికల ముందు బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. దళితుల వద్దకు వెళ్లి మీ బిడ్డను అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరుల వెన్నెముక విరిచారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నాడు ఈ జగన్.
నేడు (18-2-2024) యువనేత నారా లోకేష్ శంఖారావం వివరాలు!!
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాదు కదా.. సామాజిక అన్యాయం జరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలే ఈ విషయం చెబుతున్నారు. 62 మంది ఎమ్మెల్యేలను, 16 మంది ఎంపీలను ట్రాన్స్ ఫర్ చేస్తే అందులో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే.
జగన్ సామాజికవర్గానికి చెందిన ఎవరినీ ట్రాన్స్ ఫర్ చేయలేదు, బర్తరఫ్ చేయలేదు. బీసీలు, ఎస్సీలంటే ఆయనకు చులకన.
వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వైసీపీలో బీసీలకు గౌరవం లేదన్నారు. ఎమ్మెల్యే పార్థసారథికి కనీసం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.
సొంత ఎమ్మెల్యే ఎలీజా వైసీపీలో దళితులకు కనీసం గౌరవం లేదన్నారు. దళిత ఎమ్మెల్యే ఆర్థర్.. తమను స్టిక్కర్ గా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఏనాడూ బీసీలు, ఎస్సీలను, ఎస్టీలను చిన్నచూపు చూడలేదు.
బీసీలకు చెందిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించి 16,500 పదవులు వారికి దూరం చేశారు. బీసీలపై ఏకంగా 27వేల కేసులు పెట్టారు.
అమర్ నాథ్ గౌడ్ అనే బాలుడు.. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు వైకాపా నాయకులు బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఎంత అన్యాయం?
ఆ కేసులో ముద్దాయి విడుదలైతే వైకాపా నాయకులు జైలుకు వెళ్లి బయటకు వస్తుంటే ఊరేగిస్తున్నారు. బాధిత కుటుంబాల పిల్లలను మా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు.
బిసి, ఎస్సీ, ఎస్టీలపై అభిమానం మాటల్లో కాదు.. చేతల్లో చూపాలని జగన్ కు చెబుతున్నా.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఎస్సీలను కూడా వదిలిపెట్టలేదు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను పిచ్చోడిని చేసి చనిపోయేలా చేశారు. ఇసుక దోపిడీని ప్రశ్నించిన వరప్రసాద్ అనే యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి అనంతబాబు.
ఇప్పుడు జగన్ తన పక్కనే అనంతబాబును రివ్యూ మీటింగ్ లో కూర్చోబెట్టుకుంటున్నారు.
నన్ను చూస్తే జగన్ కు భయం. నేను యువగళం యాత్ర చేస్తుంటే జీవో 1 తీసుకువచ్చారు. స్టూల్, మైక్ కూడా లాక్కున్నారు. అయినా ఈ లోకేష్ తగ్గేదే లేదు.
నేను ఊరూరా ఎర్రబుక్ చూపిస్తుంటే.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. నాది అంబేద్కర్ రాజ్యాంగం. నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల చాటున ఉంటున్నావు. నేను 25వేల కి.మీల సీసీ రోడ్లు వేస్తే నువ్వు కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోతున్నావు.
నేను టీసీఎల్, హెచ్ సీఎల్, ఫాక్స్ కాన్, జోహో లాంటి పరిశ్రమలు తీసుకువస్తే .. నువ్వు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ తీసుకువచ్చావు. నేను స్టాన్ పోర్డ్ లో ఎంబీయే చేస్తే నిన్ను టెన్త్ క్లాస్ పేపర్ల లీక్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు.
జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. బల్ల పైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేసి, బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ తో వంద లాగేస్తున్నారు.
కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటిపన్నుపెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బాదుడే బాదుడు.
నిత్యావసర ధరలు పెంచి బాదుడే బాదుడు. బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తో లిక్కర్ రేట్లు పెంచి బాదుడే బాదుడు. రేపు వాలంటీర్ వాసు వచ్చి గొట్టం తీసుకువచ్చి పీల్చమంటాడు. పీల్చే గాలిపైనా పన్ను వేస్తారు.
వాలంటీర్లు వచ్చి టిడిపి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని చెబుతున్నారు. ఏపీకి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్.
పొత్తులపై ఫైనల్ నిర్ణయం వారిదే!! మా అభిప్రాయం చెప్పాం- పురంధేశ్వరి
ఎన్టీఆర్ రూ.2కే కేజీ బియ్యం, రూ.50కే హార్స్ పవర్ మోటార్ ఇచ్చారు. ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు దీపం పథకం, పసుపు కుంకుమ, పండుగకానుక, చంద్రన్న బీమా, పెళ్లికానుక, విదేశీ విద్య, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ లాంటి 100 పథకాలు తీసుకువచ్చారు.
ఇక జగన్ కటింగ్ మాస్టర్ కూడా.. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, పండుగ కానుకలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, నిరుద్యోగ భృతి, వృద్ధులు రావాల్సిన పెన్షన్ కట్, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సీడీ కూడా కట్. ఇలా 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్.
ప్రజలు పడుతున్న కష్టాలు చూసి బాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారు.
మొదట హామీ ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. జాబ్ కేలండర్ విడుదల చేస్తాం, ప్రతి ఏడాది డీఎస్సీ భర్తీ చేస్తాం. 5 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.
స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఒక్కరుంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది.
రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం.
ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో తెలుగు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రను దోచుకునేందుకు మూడు కుటుంబాలకు లైసెన్స్ ఇచ్చారు.
మొదటి కుటుంబం బొత్స కుటుంబం, రెండో కుటుంబం విజయసాయిరెడ్డి, మూడో కుటుంబం పేరు వైవీ సుబ్బారెడ్డి. వీరంతా పందికొక్కుల్లా దోచుకుంటున్నారు. ఎక్కడ భూమి, చెరువు కనిపించినా కబ్జా చేస్తున్నారు. ఇసుకను దోచేస్తున్నారు.
విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని జగన్ చూస్తున్నారు. భూములు కొట్టేయడానికి చూస్తున్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వంలో రాష్ట్రమే విశాఖ ఉక్కును కొనుగోలు చేస్తుంది.
జగన్ పాదయాత్రలో జిల్లాకు 50 హామీలు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ పూర్తిచేస్తామన్నారు, విశాఖ మెట్రో పూర్తిచేయలేదు. మూత పడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని మోసం చేశారు. 8 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు.. చేయలేదు.
ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మన కోడిగుడ్డు మంత్రి దెబ్బకు ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి. రాజధాని తీసుకువస్తామని చెప్పి భూములు కబ్జా చేస్తున్నారు.
దసపల్లా, హయగ్రీవ, లులూ భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు కొట్టేస్తున్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో పెద్దఎత్తున కుంభకోణానికి పాల్పడుతున్నారు. రుషికొండకు గుండు కొట్టి రూ.500 కోట్లతో ప్యాలెస్ లు కట్టుకున్నారు.
అనంతపురం: పోలీసుల ఓవర్ యాక్షన్ కు చెక్!! ఎస్పీ ప్రకటన??
విశాఖలో ఏ-2 విజయసాయిరెడ్డి అంతా నాశనం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. విశాఖ మన్యంలో లాటరైట్ బాక్సైట్ పెద్దఎత్తున దోచేస్తున్నారు. జీవీఎంసీ నుంచి ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం దోచేస్తోంది. విపరీతంగా పన్నులు పెంచారు. ఒక్క రోడ్డు కూడా వేయలేదు.
ఆంధ్రా యూనివర్సిటీలో 1500 పీహెచ్ డీ పోస్టులు కూడా అమ్ముకున్నారు. రూ.200 కోట్ల యూజీసీ గ్రాంట్లు కూడా కొట్టేశారు.
ఆనాడు హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు సొంత కుటుంబ సభ్యులను కాదని, విశాఖ ప్రజలే నా కుటుంబ సభ్యులని.. చంద్రబాబు ఇక్కడకు చేరారు. ఆనాడు మా ఇంట్లో సీమంతం జరుగుతున్నా పది నిమిషాలు ఉండి ఇక్కడకు వచ్చారు.
ఏడు రోజులు ఉండి అన్నీ చూసుకున్నారు. పాలు కావాలంటే అందించారు, నీళ్లు కావాలంటే అందించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కరెంట్ కూడా వెంటనే ఇచ్చారు. ఆనాడు మోడీ కూడా వచ్చారు.
ఎక్కైడైనా తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలు బాధపడతారని.. అదే విశాఖలో చంద్రబాబును చూసి చేతులు ఊపుతున్నారేంటి అని మోడీ అన్నారు.
పట్టుదలతో, ప్రేమతో మీకు సేవ చేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ ప్రజలు మమ్ముల్ని ఆశీర్వదించారు. అది మేం గుర్తుపెట్టుకుంటాం.
పెందుర్తి నియోజకవర్గంలో బండారు సత్యనారాయణమూర్తి చాలా సీనియర్ నాయకులు. మంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రాని నిధులు పెందుర్తికి వచ్చాయి. పులివెందులకు కూడా అన్ని నిధులు జగన్ ఇవ్వడం లేదు.
పెందుర్తికి దాదాపు రూ.4,800 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం బండారు సత్యనారాయణమూర్తి తీసుకువచ్చారు.
పెట్రో యూనివర్సిటీ, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేటాయించాయి. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మించాం. పేస్ మేకర్స్, సీటీ స్కాన్ తయారు చేసే పరిశ్రమలను, మెడ్ టెక్ జోన్ ను తీసుకువచ్చాం.
రూ.450 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించాం. ఏకంగా 6,200 టిడ్కో ఇళ్లు కట్టిన ఘనత టీడీపీది. షేర్ వాల్ టెక్నాలజీతో 6,200 ఇళ్లు కడితే కనీసం వాటిని పూర్తిచేసి, రంగులు వేసి ఇవ్వడానికి కూడా జగన్ కు మనసు రావడం లేదు. మన ప్రభుత్వంలో మొదటి వంద రోజుల్లో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తాం.
గ్రామాలను కూడా జగన్ రెడ్డి వదిలిపెట్టలేదు. ఆనాడు 3450 ఇళ్లు కేటాయించాం, హుద్ హుద్ కింద 450 ఇళ్లు ఇచ్చాం. 6 వేల మందికి పట్టాలు ఇచ్చాం. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు కట్టించాం. ఇన్ని మంచిపనులు చేసినా పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు.
ఇక్కడ బిల్డప్ బాబాయి ఉన్నాడు. మీ శాసనసభ్యుడు అదీప్ రాజు. ఆయన ఎక్కడ భూమి ఉన్నా వాలిపోతాడు. రాత్రికి చెరువు ఉంటుంది, తెల్లారేసరికి పట్టా అయిపోతుంది. సెంటు స్థలాల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు.
కొండలను కూడా వదిలిపెట్టడం లేదు. పేదవాడిలా బిల్డప్ ఇస్తాడు. బండారు పెద్దపెద్ద ప్రాజెక్టులు తీసుకువస్తే.. మీ ఎమ్మెల్యే ట్రాన్స్ ఫార్మర్ కు రిబ్బన్ కట్ చేస్తాడు.
అందుకే టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. పంచ గ్రామాల సమస్య పరిష్కరిస్తాం, తాడి గ్రామంలో నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తాం. మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటాం. టిడ్కో ఇళ్లు పూర్తిచేస్తాం.
చంద్రబాబు బీజేపీతో పొత్తును వ్యతిరేకించే ప్రతి ఒక్కరు... కార్యకర్త కష్టం ఆలోచించారా?? : ఎం ఎ షరీఫ్
సబ్బవరం నుంచి షీలా నగర్ వరకు 6లేన్ల రోడ్ వేస్తాం. పెట్రో యూనివర్సిటీ, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటుచేస్తాం. అవసరమైన మేరకు పట్టాలు కూడా ఇస్తాం.
టీడీపీ బలం కార్యకర్తలు. దేశంలోనే కార్యకర్తల పార్టీ టీడీపీ. నాయకులు వెళ్ళినా కార్యకర్తలు అండగా ఉన్నారు. పసుపు జెండాను చూస్తే నూతన ఉత్సాహం. గత ఐదేళ్లుగా ఎన్ని కేసులు పెట్టినా మడమ తిప్పకుండా టీడీపీకి కాపలా కాశారు.
వైకాపా కార్యకర్తలకు బూమ్ బూమ్ కావాలి కానీ.. చంద్రబాబు ఒక్క పిలుపునిస్తే చాలు. మీ రుణం తీర్చుకునేందుకు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు వందకోట్లు ఖర్చు చేశాం. బాధిత కుటుంబాల పిల్లలను చదివించలేకపోతే వారిని దత్తత తీసుకుని చదివిస్తున్నారు మా తల్లి భువనమ్మ.
నాకు అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ములు లేరు. అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది కార్యకర్తలను ఇచ్చారు. మీ అందరూ కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఒక కుటుంబం. అందరం కలిసి ముందుకు వెళ్లాలి.
మనపై ఇప్పటివరకు అనేక కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అటెమ్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్తుంటే అత్తగారింటికి వెళ్లినట్లు ఉంది నాకు. బాంబులకే భయపడలేదు. కేసులకు భయపడతామా?
చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. మేం వచ్చిన తర్వాత జ్యుడీషియల్ విచారణ జరిపి జైలుకు పంపిస్తాం.
అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు, వైకాపాకు ఈ లోకేష్ మూర్ఖుడు. రెడ్ బుక్ ను చూపించి నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటున్నారు.
చంద్రబాబు గారిని చూస్తే జగన్ కు భయం. నిద్రలో కూడా బాబుగారు గుర్తుకువస్తారు. అందుకే అర్థరాత్రి పోలీసులను పంపి అక్రమంగా అరెస్ట్ చేశారు. ముందు 3వేల కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 270 కోట్లన్నారు, ఇప్పుడు 27 కోట్లని అంటున్నారు. 15 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. చేయని తప్పుకు 53 రోజులు జైల్లో బంధించారు.
చంద్రబాబును ఆనాడు అక్రమంగా రిమాండ్ కు పంపిస్తే నాకు మొదట ఫోన్ చేసింది పవనన్న. మీకు అండగా నిలబడతానని, ధైర్యంగా ఉండాలని, ఏం కావాలన్నా ఒక్క ఫోన్ చాలని చెప్పారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసిందీ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్ లో 3గంటలు ఆపేశారు. అందుకే సైకో జగన్ ను తరిమికొట్టాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారు.
టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ చిచ్చు పెడతారు. వారికి రూ.5 ఇస్తే చాలు. అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాటన్నింటిని తిప్పికొట్టాలి. జనసేన కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి.
కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. బూత్ లో బాగా పనిచేసే వారికి, టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం.
నా చుట్టూ కాకుండా ప్రజల్లో తిరిగితే.. నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తా. సూపర్-6కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలు బాగా చేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డులు ఇవ్వడం జరిగింది.
ఈ ప్రాంతంలో ఉడాకు సంబంధించిన భూములు ఉన్నాయి. కొంతమంది నివాసం ఉంటున్నారు. మంగళగిరిలో కూడా కొండపోరంబోకు, అటవీ భూములు, ఎండోమెంట్,ఇరిగేషన్ భూముల్లో దశాబ్దాల పాటు నివాసం ఉంటున్నారు.
వీటన్నింటి విషయంలో విధివిధానాలు రూపొందించి, రెగ్యులరైజ్ చేసి, పట్టాలు అందించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. గతంలో కూడా ఇది మేం చేశాం. సింహాచలం భూముల విషయంలో కూడా బట్టలు పెట్టి మరీ పట్టాలు అందజేశాం. ఆ విధానం మళ్లీ తీసుకువస్తాం.
టిడిపి-జనసేన కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేయాలి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు ప్రవాసులకు ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.
#Pendurthi #NaraLokesh #Shankharavam #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.