గంట ప్రసంగంలో 100 సార్లు చంద్రబాబు పేరు!! జగన్ కు చిప్ దొబ్బిందా?? ఉత్తర విశాఖలోనారా లోకేష్

Header Banner

గంట ప్రసంగంలో 100 సార్లు చంద్రబాబు పేరు!! జగన్ కు చిప్ దొబ్బిందా?? ఉత్తర విశాఖలోనారా లోకేష్

  Mon Feb 19, 2024 15:00        Politics

విశాఖ ఉత్తర నియోజకవర్గం శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ ప్రసంగం:


గత 9 రోజులుగా ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఇక్కడి జీవితాలతో జగన్ ఓ ఆట ఆడారు. రెండు నెలల్లో ప్రజలు జగన్ ను ఫుట్ బాల్ ఆడుకుంటారు.

పౌరుషాల గడ్డ, పోరాటాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర. ఏపీకే కాదు.. దేశానికే సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ. ప్రశాంతంగా ఉంటే పట్టణం విశాఖ. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ మహానగరం.

చంద్రబాబు హయాంలో విశాఖను జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే జగన్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మహిళలు ఒకసారి ఆలోచించాలి. ఒక్క విశాఖలోనే కాదు మా సొంత జిల్లా చిత్తూరులో కూడా గంజాయి మాఫియా ఉంది.

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మాఫియాను పెంచి పోషిస్తున్నారు. రెండు నెలలు ఓపిక పడితే అలాంటి వాళ్లపై ఉక్కుపాదం మోపి, గంజాయిని శాశ్వతంగా నిర్మూలిస్తాం.

జగన్ పాలనలో విశాఖలో రోజుకో కిడ్నాప్, విధ్వంసం, మర్డర్, రోజుకో భూకుంభకోణం. సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారంటే పరిస్థితికి అర్థంచేసుకోవచ్చు. వారి భూకుంభకోణాలకు సహకరించలేదని వైకాపా నాయకులు ఎమ్మార్వో రమణయ్యను హత్య చేశారు.

కొడాలి నానికి బిగ్ షాక్!! గుడివాడలో వేడెక్కిన రాజకీయం!!

సింహాద్రి అప్పన్నస్వామి కొలువైన పుణ్యభూమి విశాఖ. జగన్ పదేపదే సిద్ధం అంటున్నారు. నిన్న రాప్తాడుకు వెళితే వైకాపా నాయకులు, కార్యకర్తలేమో తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఏకంగా సభ తుస్సుముంది. ప్రజలు వెళ్లిపోతున్న సమయంలో అక్కడున్న మీడియా మిత్రుడు ఫోటోలు తీస్తుంటే ఉక్రోషంతో వైకాపా రౌడీలు చితకబాదే పరిస్థితి.

ముఖ్యమంత్రి సభకు వెళితే చేసిన మంచి పనులు చెప్పుకుంటారు. ఈ ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు పేరు జపం చేస్తున్నారు. గంట ప్రసంగంలో 100 సార్లు చంద్రబాబు పేరు పలికారు. దానిని బట్టి ఈయన పీకిందేమీ లేదని అర్థమవుతోంది.

సైకిల్, గ్లాస్, ఫ్యాన్ గురించి మాట్లాడారు. సైకిల్, గ్లాస్ విలువ పెత్తందారుకు అర్థంకాదు. సైకిల్ సామాన్యుడి చైతన్య రథం. గ్లాస్ లో సామాన్యుడు టీ తాగుతారు. జగన్ బంగారు, వెండి గ్లాస్ లో టీ తాగుతారేమో. ఇవాళ cదీనిని చెత్తబుట్టలో పడేయటమే మంచిది.

రైతు ఆత్మహత్యలకు ఫ్యాన్ ఉపయోగపడింది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3 వ స్థానంలో రాష్ట్రం నిలిచింది. యువకులు ఆత్మహత్య చేసుకునేందుకు ఈ ఫ్యాన్ ఉపయోగపడుతోంది.

2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, గ్రూప్-1,2 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారు. 6500కానిస్టేబుల్ భర్తీ చేస్తామని చెప్పారు. లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ లు తీసుకుంటున్నారు. కానిస్టేబుల్ పరీక్ష కోచింగ్ కోసం 2 లక్షలు ఖర్చుపెట్టినట్లు ఓ తల్లి నాకు చెప్పింది. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చిందీ ప్రభుత్వం.

భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునేందుకు ఈ ఫ్యాన్ ఉపయోగపడుతోంది. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. నాడు వెయ్యి రూపాయలు ఉన్న ట్రాక్టర్ ఇసుక నేడు 5వేలకు చేరింది. ఎవరికీ పనులు దొరకని పరిస్థితి. చేనేత కార్మికులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోతున్నారు.

జగన్ ఐదేళ్ల పాలనలో 35 వేల మంది ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయారు. అందుకే ఫ్యాన్ రెక్కలు విరిచి చెత్తబుట్టలో పడేయాలి.

నేను 3,132 కి.మీ పాదయాత్ర చేశాను. చంద్రబాబు చేసిన అభివృద్ధిపై సెల్ఫీలు దిగాను. ఆనాడే జగన్ కు ఛాలెంజ్ చేశా. సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరా. అవతల నుంచి సౌండ్ లేదు.

భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న పవన్!! రేపటి నుంచి బస అక్కడే??

మండుటెండలో జగన్ వాళ్ల కార్యకర్తలను సెల్ లో టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ల కార్యకర్తలు ఒకళ్ల మొహం ఒకరు చూసుకున్నారు. జగన్ కు చిప్ దొబ్బిందా, రేచీకటి ఏమైనా ఉందా అని నవ్వుకున్నారు. స్క్రిప్ట్ ఎవరో రాశారో కానీ సమయం, సందర్భం లేదు.

నవరత్నాల పేరుతో నవ మోసాలు చేశారు. జలయజ్ఞం పేరు చెప్పి తట్టమట్టి కూడా వేయలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓట్లు అడుగుతానన్నారు. ఇప్పుడు బూమ్ బూమ్ దుకాణాలు పెట్టి మద్యం ఏరులై పారిస్తున్నారు.

కల్తీ మద్యం తాగి లక్షలాది మంది చనిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టార్గెట్లు పెట్టి మరీ విక్రయిస్తున్నారు. వెయ్యి పైన అనారోగ్యానికి ఆరోగ్యశ్రీ అమలు చేస్తామన్నారు. ఇప్పుడు పెండింగ్ బకాయిలు పెట్టి నాశనం చేశారు.

ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి అని చెప్పి మోసం చేశారు. పేదలకు 30 లక్షల ఇళ్లు కడతామన్నారు. కనీసం 3వేలు కట్టలేదు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు. ఆసరా, చేయూత పేరుతో పది రూపాయలు ఇచ్చి వంద లాక్కుంటున్నారు.

ఆటో డ్రైవర్ల మాకు 10వేలు వద్దు ఫైన్ లు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమంటున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. మేం పాత ఫీజు రీయింబర్స్ మెంట్ విధానాన్ని తీసుకువస్తాం. రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి 4 గంటలు కూడా ఇవ్వడం లేదు. మీ నవమోసాలపై చర్చకు సిద్ధమా?

వై నాట్ 175 అంటున్నారు. నేను నై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వైనాట్ పోలవరం, వైనాట్ జాబ్ కేలండర్, గ్రూప్-1,2 పోస్టులు, వైనాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం అంటున్నా.. వీటిపై సమాధానం చెప్పాలి.

మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. సొంత తల్లి, చెల్లి నమ్మడం లేదు. మనం ఎలా నమ్మాలి? సిద్ధం అంటున్నారు.. సొంత చెల్లి ఈయనను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు షర్ట్ మడత పెడతా అంటున్నారు.. ప్రజలు కుర్చీ మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

జగన్ రెడ్డి కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్. బల్ల పైన బులుగు బటన్ నొక్కి అకౌంట్ లో రూ.10 వేసి, బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ తో వంద లాగేస్తున్నారు.

కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటిపన్ను, చెత్తపన్ను పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి బాదుడే బాదుడు. నిత్యావసర ధరలు పెంచి బాదుడే బాదుడు. బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తో లిక్కర్ రేట్లు పెంచి బాదుడే బాదుడు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

రేపు వాలంటీర్ వాసు వచ్చి గొట్టం తీసుకువచ్చి పీల్చమంటాడు. దయచేసి ఊదొద్దు. పీల్చే గాలిపైనా పన్ను వేస్తాడు ఈ సైకో జగన్.

అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చేలోగా నిజం గడప కూడా దాటదు. వాలంటీర్లు వచ్చి టిడిపి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని చెబుతున్నారు. ఏపీకి సంక్షేమం పరిచయం చేసింది ఎన్టీఆర్ అని వారికి చెప్పాలి.

ఎన్టీఆర్ రూ.2కే కేజీ బియ్యం, రూ.50కే హార్స్ పవర్ మోటార్ అందజేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు.

ఆయన స్ఫూర్తితో చంద్రబాబు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేశారు, పసుపు కుంకుమ, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, పెళ్లికానుక, అన్న క్యాంటీన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య లాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు చంద్రబాబు.

ఇక జగన్ కటింగ్ మాస్టర్ కూడా.. అన్న క్యాంటీన్లు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, పండుగ కానుకలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, నిరుద్యోగ భృతి, వృద్ధులు రావాల్సిన పెన్షన్ కట్, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సీడీ కూడా కట్. ఇలా 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

మీరు పడుతున్న కష్టాలు చూసి బాబు-పవన్ కలిసి సూపర్ -6 హామీలు ప్రకటించారు.

సిద్ధం సభల్లో ఏరులై పారుతున్న మద్యం!! ఆకలితో అల్లాడిపోతున్న పోలీసులు!!

మొదట హామీ ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేం తీసుకుంటాం. ప్రతి డీఎస్సీ ఏర్పాటుచేస్తాం. పద్దతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగం రాని వారికి అప్పటివరకు 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.

స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం, ఒక్కరుంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే ఏడాదికి రూ.45 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది.

రైతుల్ని ఆదుకునేందుకు ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తాం.

ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తాం, ఏడాదికి రూ.18వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఆరో హామీ ఆర్టీసీ బస్సుల్లో తెలుగు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.

అసలు ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ, ఉద్యోగం తీసుకురాలేదు. ఇప్పుడు ఏకంగా విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కాపాడతాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.

జగన్ విశాఖ పాదయాత్రలో జిల్లాకు 50 హామీలు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ పూర్తిచేస్తామన్నారు, చేయలేదు. విశాఖ మెట్రో పూర్తిచేస్తామన్నారు, పూర్తిచేయలేదు. మూత పడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని మోసం చేశారు. 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు.. తాగునీరు కూడా తీసుకురాలేదు.

ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చి ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మన కోడిగుడ్డు మంత్రి దెబ్బకు ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి.

విశాఖకు పరిపాలన రాజధాని తీసుకువస్తామని చెప్పి భూములు కబ్జా చేస్తున్నారు. రుషికొండకు గుండుకొట్టి ఏకంగా రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. ఒక వ్యక్తి కోసం ఇంత ఖర్చు పెట్టారు. టిడ్కో ఇళ్లకు ఆ డబ్బు ఖర్చు పెట్టి ఉండే మీ అందరికీ ఇళ్లు వచ్చేవి. రోజుకో భవనంలో పడుకుంటాడా?

ఆంధ్రా యూనివర్సిటీలో 1400 పీహెచ్ డీ సీట్లు అమ్ముకున్నారు. ఇక్కడ విసి ప్రసాదరెడ్డి పేరు కూడా ఎర్రబుక్ లో రాసుకున్నా. అధికారంలోకి వచ్చాక ఆయనపై న్యాయవిచారణ జరుపుతాం.

ఏపీ రాజకీయ తెర మీదకు నటుడు సుమన్!! పోటీ ఎక్కడ నుండి??

విశాఖ నార్త్ టీడీపీ కంచుకోట. మంచి మెజార్టీతో గంటా గారిని గెలిపించారు. 2014-19లో టీడీపీ చేసిన అభివృద్ధే ఇప్పటికీ ఉంది. మేం వేసిన డ్రైయిన్లు, రోడ్లే ఉన్నాయి. రూ.200 పెన్షన్ ను రూ.2000 చేశాం. 118 సంక్షేమ కార్యక్రమాలు కులాలకు, మతాలకు అతీతంగా అందించాం. కమ్యూనిటీ భవనాలు కట్టాం.

ఆనాడు హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు సొంత కుటుంబ సభ్యులను కాదని, విశాఖ ప్రజలే నా కుటుంబ సభ్యులని.. తుఫానుకు ముందే ఇక్కడకు చేరారు. ఆనాడు మా ఇంట్లో సీమంతం జరుగుతున్నా చంద్రబాబు పది నిమిషాలు ఉండి ఇక్కడకు వచ్చారు. విద్యుత్, పాలు, నీళ్లు యుద్ధ ప్రాతిపదికన అందించారు.

2019 ఎన్నికల్లో ఎదురుగాలిలో సైతం విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లో టీడీపీని గెలిపించారు. ఈ నాలుగు నియోజకవర్గాలను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తాం.

కొండవాలు ప్రాంతాల్లో నివసించే వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. నిరుపేదలకు టిడ్కో ఇళ్లు కట్టిస్తాం. హైవే దాటాలంటే కింద నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. బ్రిడ్జి నిర్మించే బాధ్యత తీసుకుంటాం. అల్లూరి విగ్రహం ఏర్పాటుచేయాలని కోరారు, తప్పకుండా ఏర్పాటుచేస్తాం.

వైకాపా తరపున కేకే రాజు ఇక్కడ తిరుగుతున్నారు. ఈ నియోజకవర్గాన్ని గంజాయికి, రౌడీయిజానికి కేంద్రంగా మార్చారు. ఏకంగా మిషనరీ భూములు కూడా స్వాహా చేస్తున్నారు. రుషికొండ, హయగ్రీవ, దసపల్లా భూములు కొట్టేస్తున్నారు. కన్ను పడితే మీ భూములు కూడా కొట్టేస్తాడు.

టీడీపీ బలం కార్యకర్తలు. దేశంలోనే కార్యకర్తల పార్టీ టీడీపీ. నాయకులు వెళ్ళినా కార్యకర్తలు అండగా ఉన్నారు. పసుపు జెండాను చూస్తే నూతన ఉత్సాహం. గత ఐదేళ్లుగా ఎన్ని కేసులు పెట్టినా మడమ తిప్పకుండా టీడీపీకి కాపలా కాశారు.

వైకాపా కార్యకర్తలకు ఉత్సాహం రావాలంటే బూమ్ బూమ్ కావాలి కానీ.. పసుపు సైనికులకు చంద్రబాబు ఒక్క పిలుపునిస్తే చాలు.

మీ రుణం తీర్చుకునేందుకు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటుచేసి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు వందకోట్లు ఖర్చు చేశాం. బాధిత కుటుంబాల పిల్లలను చదివించలేకపోతే వారిని దత్తత తీసుకుని చదివిస్తున్నారు మా తల్లి భువనమ్మ.

నాకు అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములు లేరు. అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది కార్యకర్తలను ఇచ్చారు. మనం అందరం ఒక కుటుంబం. అందరం కలిసి ముందుకు వెళ్లాలి.

టిడిపి కార్యకర్తలపై ఇప్పటివరకు అనేక కేసులు పెట్టారు. నాపై 22 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అటెమ్ట్ మర్డర్ కేసులు పెట్టారు. అయినా ఈ లోకేష్ తగ్గేదే లేదు.

9 నగరాల్లో 9 ప్యాలెస్లు ఉన్న పెత్తందారుడి మరో ప్యాలస్!! - నారా లోకేష్

అర్థరాత్రి పోలీసులను పంపి చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారు. ముందు 3వేల కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 270 కోట్లన్నారు, ఇప్పుడు 27 కోట్లని అంటున్నారు. అది కూడా పార్టీ అకౌంట్ లోకి వచ్చిందంటా? 15 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు.

చేయని తప్పుకు చంద్రబాబును 53 రోజులు జైల్లో బంధించారు. బాంబులకే మేం భయపడలేదు. చిల్లర కేసులకు మేం భయపడతామా? మేం నిరంతరం ప్రజల్లో ఉండి సేవచేశాం.

చంద్రబాబును ఆనాడు అక్రమంగా రిమాండ్ కు పంపిస్తే నాకు మొదట ఫోన్ చేసింది పవనన్న. మీకు అండగా నిలబడతానని, ధైర్యంగా ఉండాలని, ఏం కావాలన్నా ఒక్క ఫోన్ చాలని చెప్పారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పవన్ రాష్ట్రానికి వస్తుంటే ఆయన విమానానికి పర్మిషన్ క్యాన్సిల్ చేసిందీ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఏపీ బోర్డర్ లో 3గంటలు ఆపేశారు. అందుకే సైకో జగన్ ను తరిమికొట్టాలని చంద్రబాబు-పవన్ నిర్ణయించుకున్నారు.

టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ చిచ్చు పెడతారు. వారికి రూ.5 ఇస్తే చాలు. అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాటన్నింటిని తిప్పికొట్టాలి. పవన్ నినాదం హలో ఏపీ.. బైబై వైసీపీకి అందరం కట్టుబడి ఉండాలి.


నేను ఎవరినీ వదిలిపెట్టను. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు, అక్రమాలకు పాల్పడిన వైకాపా నాయకుల పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయి. మేం వచ్చిన తర్వాత జ్యుడీషియల్ విచారణ చేయించి జైలుకు పంపిస్తాం. రెడ్ బుక్ ను చూపించి నాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటున్నారు.

అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు గారు రాముడు.. వైకాపా నేతలకు లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా చెల్లిస్తాం.

కార్యకర్తలందరూ ప్రతి గడపకు వెళ్లి సూపర్-6 కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. బూత్ లో బాగా పనిచేసే వారికి, టీడీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం.

బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలు బాగా చేసిన వారికి ఉత్తమ కార్యకర్త అవార్డులు ఇస్తున్నాం. నా చుట్టూ కాకుండా ప్రజల్లో తిరిగితే.. నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తా. వారికి నామినేటెడ్ పదవులు ఇస్తాం. పనిచేసే వారిని గౌరవిస్తాం. సూపర్-6 కార్యక్రమాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా.

వైసిపి పేటిఎం బ్యాచ్ మాయలో పడకుండా టిడిపి-జనసేన కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేయాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

తెలుగు ప్రవాసులకు  ఉపయోగపడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒకచోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూపులో జాయిన్ అవ్వండి.

Whatsapp group

Telegram group

Facebook group


   #NaraLokesh #Shankharavam #Vizag #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024