NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!

Header Banner

NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!

  Wed Feb 21, 2024 16:48        India, World

మన రోజువారి జీవితంలో చాలామంది బ్రతుకుతెరువు కోసం లేదా ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళ్లి అక్కడ నివసిస్తుంటారు. దీనికి అనేక చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లు అవసరమవుతాయి. ఇక్కడ, మనం రెండు పదాలను వింటూ ఉంటాము NRI (నాన్-రెసిడెంట్ ఇండియన్) మరియు OCI (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా). రెండు పదాలు ఒకేలా కనిపించినప్పటికీ, పౌరులకు అవి రెండు వేర్వేరు సదుపాయాలను అందిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే NRIలు విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు, OCIలు భారతీయ వారసత్వంతో విదేశీ పౌరులు.

మరి కొన్ని తాజా కువైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా ఏదైనా కారణంతో విదేశాల్లో నివసించే భారతీయ పౌరుడిని NRI అంటారు. 6 నెలలు అంటే 183 రోజులు విదేశాలలో ఉన్న భారత పౌరులను NRI అంటారు. NRI హోదా కలిగిన వ్యక్తులకు భారతీయ పౌరసత్వం ఉంటుంది. వీరికి ప్రధానంగా ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) మరియు భారత ఆదాయపు పన్ను చట్టం వర్తిస్తుంది. వీరికి భారతదేశంలో ఓటు హక్కు ఉంటుంది.

ఆసక్తికరమైన UAE వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

భారతీయులు ఎవరైనా పరాయి దేశానికి వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాలు నివాసం ఉన్న తరువాత ఆ దేశం వారికి పౌరసత్వ హక్కులను తీసుకునే వీలు కల్పిస్తుంది. ఒక వేళ ఆ భారతీయుడు ఆ పౌరసత్వాన్ని అందుకుంటే వారు భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. అప్పుడు భారతదేశం యొక్క పాస్పోర్ట్ ను అతను సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ దేశం యొక్క పాస్పోర్ట్ పొందుతాడు. భారత పౌరులు కాకపోతే వారికి దేశానికి రావడానికి వీసా కావలసి ఉంటుంది, నిర్దిష్ట సమయం వరకూ మాత్రమే దేశంలో ఉండగలరు, దేశంలో ప్రాపర్టీస్ కొనడానికి అవకాశం ఉందదు. ఇంకా అతను భారత్ కి విదేశీయుడు అవుతాడు. ఇటీవల తీసుకొచ్చిన చట్టాల ప్రకారం భారతదేశ వారసత్వం ఉన్నవారికి కొన్ని సౌకర్యాలను కల్పించారు. ఆ సౌకర్యాలు పొందాలి అంటే తప్పకుండా వారు OCI కార్డ్ ను అప్లై చేసుకోవాలి. ఈ కార్డ్ ను ఇండియన్ ఎంబసీ లలో అప్లై చేసుకోవచ్చు. ఒక సారి ఈ కార్డ్ తీసుకుంటే వారికి కొన్ని సదుపాయాలు ఉంటాయి. OCI భారతీయ పౌరుడు కాదు కానీ భారతదేశంలో రెసిడెంట్ తో సమానమైన కొన్ని ప్రత్యేక సౌకర్యాలను మంజూరు చేస్తారు. OCI కార్డ్ ఉంటే భారత్ వీసా లేకుండా దేశంలోకి రావొచ్చు, భారతదేశంలో ప్రాపర్టీస్ (వ్యవసాయ భూములు తప్ప) కొనుగోలు చేయవచ్చు, ఎన్ని రోజులు అయినా దేశంలో నివసించవచ్చు. కానీ, వీరికి భారత దేశం లో ఓటు హక్కు ఉండదు. భారత పౌరసత్వం కోల్పోయిన వారు OCI కార్డ్ అప్లై చేసుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మరియు ప్రభుత్వం ఇచ్చే వసతులను ఉపయోగించుకోడంలో సహాయపడుతుంది.

తాజా ఖతార్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

మీరు ఎవరైనా విదేశీ పాస్పోర్ట్ కలిగి ఉండి, భారతీయ సంతతి వారైన చో OCI కార్డు కావాలనుకున్న యెడల మీ దగ్గరలో ఉన్న ఇండియన్ ఎంబసీ కి వెళ్ళి OCI కార్డ్ ను అప్లై చేసుకోవచ్చు.

తాజా ఆస్ట్రేలియా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆసక్తికరమైన బహ్రాయిన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఏపీలో వరుస సర్వేల్లో టీడీపీ-జనసేన హవా! వైసీపీకి ఎదురుగాలి తప్పదు!! 

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Pravasi #TeluguPravasi #TeluguMigrants #AndhraMigrants #NRI #OCI #Abroadnews