గత ఐదేళ్లలో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్ ఇవే!

Header Banner

గత ఐదేళ్లలో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్ ఇవే!

  Thu Feb 29, 2024 11:48        Business

గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు మంచి రిటర్నులు అందించిన టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ వివరాలను ఈటీ సేకరించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.

 

SIP లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ చాలా మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడే మార్గం. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా మార్కెట్‌లో నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడానికి ఈ సిప్ ఇన్వెస్టర్లకు సాయపడుతుంది. దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి ఇదే చాలా సులభమైన, బహుశా ఏకైక నిరూపితమైన మార్గం. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు మంచి రిటర్నులు ఇచ్చి సంపదను పెంచిన టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ వివరాలను ఎకనామిక్ టైమ్స్ మ్యూచువల్ ఫండ్స్ విభాగం సేకరించింది. ఇవి 33.22 శాతం నుంచి 48.52 శాతం వరకు ఇన్వెస్టర్లకు లాభాలను అందించాయి.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇందులో టాప్ ఎస్ఐపీ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. ఇందులో గత ఐదేళ్లలో ప్రతి నెల రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే 48.52 XIRR (పెట్టుబడికి వచ్చే రిటర్నులు)తో ఆ మొత్తం రూ. 19.01 లక్షలకు చేరేది. ఇక క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 37.46 శాతం ఎక్స్ఐఆర్ఆర్ తో ప్రతి నెల రూ. 10,000 ఎస్ఐపీ చేస్తే ఐదేళ్లలో రూ. 14.81 లక్షలు అయి ఉండేది. టాప్ - 10 మ్యూచువల్ ఫండ్స్ జాబితాలో ఏమేం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

 

గత ఐదేళ్లలో ప్రతి నెల రూ. 10 వేలు ఎస్ఐపీ చేస్తే ఇప్పుడు ఎంత అయి ఉండేదంటే..?

- క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లో ఐదేళ్ల పాటు రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే ఇప్పుడు సంపద విలువ రూ. 19.01 లక్షలకు చేరి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ 48.52 శాతంగా ఉంది.

 

- క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ లో రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే రూ. 14.81 లక్షలు అయి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ 37.46 శాతంగా ఉంది.

 

బ్యాంక్‌, పోస్టాఫీస్‌ ఖాతాదార్లకు అలెర్ట్‌ - మార్చి 31లోగా ఈ పని చేయకపోతే జరిమానా 

 

- నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ లో రూ. 10 ఎస్ఐపీ చేసి ఉంటే రూ. 14.79 లక్షలు అయి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ 37.4 శాతంగా ఉంది.

 

- క్వాంట్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్లో రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే రూ. 14.49 లక్షలు అయి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ 36.51 శాతంగా ఉంది.

 

- క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్లో రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే రూ. 14.28 లక్షలు అయి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ రూ. 35.88 శాతంగా ఉంది.

 

- హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఫండ్లో రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే ఐదేళ్లకు రూ.13.62 లక్షలు అయి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ 33.82 శాతంగా ఉంది.

 

సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పెట్టుబడికి భారీ ఆదాయం! పన్ను ఆదా! 

 

- ఎస్బీఐ కాంట్రా ఫండ్ లో రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే రూ 13.53 లక్షలు అయి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ 33.56 శాతంగా ఉంది.

 

- బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్లో రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే రూ. 13.53 లక్షలు అయి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ 33.55 శాతంగా ఉంది.

 

- ఫ్లాంక్లిన్ ఇండియా స్మాలర్ కాస్ ఫండ్ లో రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే రూ. 13.45 లక్షలు అయి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ 33.27 శాతంగా ఉంది.

 

-హెచ్డీఎఫ్సీ స్మాల్ క్యాప్ ఫండ్ లో రూ. 10 వేలు ఎస్ఐపీ చేసి ఉంటే రూ. 13.43 లక్షలు అయి ఉండేది. ఎక్స్ఐఆర్ఆర్ 33.22 శాతంగా ఉంది.

 

ఈ బ్యాంకులో 1001 డేస్ స్పెషల్ స్కీమ్! 9.5 శాతం వడ్డీ! రూ.5 లక్షలకు ఎంతొస్తుంది? 

 

గమనిక: ఇది రికమండేషన్ కాదు. గత 5 సంవత్సరాలలో టాప్ 10 ఈక్విటీ స్కీమ్ లను తెలుసుకునేందుకు మాత్రమే ఉద్దేశించినది. దీని ఆధారంగా పెట్టుబడి లేదా విముక్తి నిర్ణయాలు తీసుకోకూడదు. స్కీమ్ గత పనితీరు భవిష్యత్ పనితీరుకు హామీ ఇవ్వదు. అందుకే ఇన్వెస్ట్ చేసేముందు పూర్వపరాలు పరిశీలించి, లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.

 

ఇవి కూడా చదవండి: 

జగన్ అక్రమాస్తుల పిటిషన్లు తేల్చాలి!! తెలంగాణ హైకోర్టు సిబిఐ కు కీలక ఆదేశాలు 

 

వైసీపీ 8వ జాబితా విడుదల!! 

 

ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!! 

 

వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడుతున్న టీడీపీ నేతలు!! 

 

టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే అమరావతి రైతులకు న్యాయం!! కాశీ నవీన్ కుమార్ 

 

నేడు (29-02-2024) నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి యాత్ర షెడ్యూల్!! 

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #TeluguMigrants #IndianMigrants #AndhraMigrants #Migrants #TelanganaMigrants #BusinessNews #BankRates #InterestRates #ITR #IncomeTax #IncomeTaxReturn