వరంగల్ టికెట్ కోసం సీనియర్లతో పోటీ పడుతున్న ఎన్నారై ప్రవీణ్!! ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో ఢిల్లీలో భేటీ

Header Banner

వరంగల్ టికెట్ కోసం సీనియర్లతో పోటీ పడుతున్న ఎన్నారై ప్రవీణ్!! ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో ఢిల్లీలో భేటీ

  Thu Feb 29, 2024 21:12        Politics

 

వరంగల్ టికెట్ రేసులో అమెరికా ఎన్నారై చింత ప్రవీణ్

ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో ఢిల్లీలో భేటీ

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

వరంగల్ (ఎస్సీ) లోక్ సభ స్థానం నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని దాదాపు యాభై మంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాలకుర్తి, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట, భూపాలపల్లి ఆరు స్థానాల్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే ఎంపీ సీట్లలో వరంగల్ కూడా ఒకటి అనే ప్రచారంతో టికెట్ కోసం పోటీ పెరిగింది.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఏఐసీసీ కార్యదర్శి, ఎన్.ఎస్.యు.ఐ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షులు రోహిత్ చౌదరిని గురువారం (29.02.2024) ఢిల్లీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్, అమెరికా విభాగం సభ్యులు చింత ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని చింత ప్రవీణ్ ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. యువకుడు, విద్యావంతుడు అయిన చింత ప్రవీణ్ అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వరంగల్ ఎంపీ టికెట్ రేసులో సీనియర్లతో పోటీ పడటం విశేషం.

 

అమెరికా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇవి కూడా చదవండి:

ఎన్నారై టీడీపీ USA రాయలసీమ స్పోక్స్ పర్సన్ గా చెంచు వేణుగోపాల్ రెడ్డి!

 

ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు చేదు అనుభవం!!

 

ముగియనున్న "రా కదలి రా"!! సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి చంద్రబాబు!!

 

కుమారుడు శరత్ అరెస్ట్ పై స్పందించిన ప్రత్తిపాటి పుల్లారావు!

 

సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు! నా కర్మ.. ‘ఇదొక.. కంట్రీ’ అంటూ చిన్మయి అభ్యంతరకర వ్యాఖ్యలు!

 

సైకిల్ కి అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి... కార్యకర్తలకు భువనమ్మ పిలుపు..

 

ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు!! మక్కెలు విరగ్గొడతాం!! 'జెండా' సభలోపవన్ కల్యాణ్

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #తెలంగాణా #వరంగల్ #AndhraPravasi #Pravasi #ChinthaPraveen #NRI #America #Congress #TeluguMigrants #Telangana #TelanganaLokSabha #Election2024