1,000 విమానాశ్రయాలకు పైగా ఉన్న 5 దేశాలు! మన దేశంలో ఎన్నో తెలిస్తే షాక్!!

Header Banner

1,000 విమానాశ్రయాలకు పైగా ఉన్న 5 దేశాలు! మన దేశంలో ఎన్నో తెలిస్తే షాక్!!

  Mon Mar 11, 2024 19:01        Travel, World

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అందమైన విమానాశ్రయాలు ఉన్నాయి. విమానాశ్రయాలు దేశానికి ప్రవేశ ద్వారం లాంటిది. ప్రతి దేశంలోని ప్రధాన నగరాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోని వెయ్యికి పైగా విమానాశ్రయాలను కలిగి ఉన్న ఐదు ప్రధాన దేశాల గురించి మనం తెలుసుకుందాం. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధికంగా 14వేల 712 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక విమానాశ్రయాలను కలిగి ఉన్నదేశం.

 

ఇంకా చదవండి: తవ్వే కొద్దీ బయటపడుతున్న బంగారం, దుస్తులు, విలువైన సంపద!! ఆ సమాధి బంగారు కొండ..

 

దీని ద్వారా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు యునైటెడ్ స్టేట్స్ కు ప్రయాణిస్తుంటారు. అంతేకాదు వీటిలో 102 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. 1,000 కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉన్న దేశాలలో బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో మొత్తం 4,093 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో 23 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో బ్రెసిలియా అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. మెక్సికో 1,714 విమానాశ్రయాలతో మూడవ స్థానంలో ఉంది. కానీ వాటిలో 36 మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాన్ని అందిస్తున్నాయి.

 

ఇంకా చదవండి: అమెరికా: సియాటెల్‌లో తెలంగాణ తెలుగు అసోసియేషన్ మహాసభలకు భారీ ఏర్పాట్లు! మే 24-26!

 

2015లో ప్రారంభించబడిన బెనిటో జుయారెజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఇక్కడ చాలా విమానాలు దిగుతాయి. ఇక కెనడాలో 1467 విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ జాబితాలో కెనడా నాలుగో స్థానంలో ఉంది. కెనడా దాని సహజ అందం స్వచ్ఛమైన పర్యావరణానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచం నలుమూలల నుండి మిలియన్ల మంది పర్యాటకులు ఏడాది పొడవునా కెనడాకు వస్తుంటారు. ఇక్కడి టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయంలో చాలా విమానాలు వస్తుంటాయి.

 

ఇంకా చదవండి: కువైట్: డిసిప్లీనరీ డిటెన్షన్ నుండి పోలీసుల విడుదల! రంజాన్ సందర్భంగా!

 

రష్యాలో మొత్తం 1218 విమానాశ్రయాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో రష్యా ఐదో స్థానంలో ఉంది. మాస్కోలో మాత్రమే ఒక మధ్యస్థ మరియు రెండు పెద్ద విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 80 మిలియన్లకు పైగా ప్రయాణీకులు విమాన సేవలను ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కేవలం 486 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. మన దేశంలో 1000 విమానాశ్రయాలలో సగం కూడా లేవు. వీటిలో 34 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 కస్టమ్స్ విమానాశ్రయాలు మరియు 103 దేశీయ విమానాశ్రయాలతో సహా మొత్తం 137 విమానాశ్రయాలు ఉన్నాయి.


 మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అల్-ఖైదా ఉగ్రవాది మృతి!! రూ.40 కోట్ల రివార్డు!!

 

ఆస్కార్ వేదికపైకి నగ్నంగా వచ్చి అందరినీ షాక్‌కు గురిచేసిన నటుడు.. అతడిని అలా చూసి షాకైన ప్రేక్షకులు

 

USA: భారతీయ యువతి అదృశ్యమైన ఉదంతం ప్రస్తుతం కలకలం! యువతికి బైపోలార్ డిజార్డర్

 

న్యూజిలాండ్: ప్రభుత్వం ప్రవాస కార్మికులకు బంపర్ ఆఫర్! పెరిగిన కనీస శాలరీ లిమిట్! మార్చ్ 1 నుండి!

 

చికెన్‌లో ఈ పార్ట్ తింటే అంతే ఇక!! అది ఏమిటో తెలుసుకోండి!!

 

వైసీపీ పాలన మొత్తం ప్రజల సొమ్మును దోచుకోవడం పంచుకోవడమే!!

 

ఆస్ట్రేలియాలో భార్య హత్య.. విషయం బయటపడేలోగా హైదరాబాద్ వచ్చేసిన భర్త! వివరాలకు వెళితే!!

 

యూఏఈ: భారతీయులకు గుడ్ న్యూస్! మల్టీ టూరిస్ట్ వీసా! 90 రోజులు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #World #Airports #InternationalAirports #WorldNews #Travel #1000AirportssInUSA #USA #Brazil #Mexico #Canada #Russia