"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్!!
Thu Mar 14, 2024 12:21 Politics"కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూల స్పందన.
తెలంగాణా రాష్ట్రంలో ప్రధానమైన చాలా కులాల్లోని పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ యా కులాలను ఉద్దేశించి ఒక్కొక్క కార్పొరేషన్ ని ఏర్పాటుచేయుటకు ఆమోదం తెలిపిన విషయం విదితమే.
మొన్న శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెసు ప్రభుత్వం కొన్ని అగ్రవర్ణాల కుల కార్పోరేషన్లు ఏర్పాటుకు ఆమోదంతెలిపారు. వాటిల్లో కమ్మకులం కార్పొరేషన్ లేదు.
నిన్న వెంటనే మాజీమంత్రి శ్రీ మండవ వెంకటేశ్వరరావు స్పందించి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి కమ్మకులంలోని ఆర్థికంగా బలహీనులను పేదలను ప్రభుత్వం తరపున ఆదుకోవడానికి "కమ్మ కార్పొరేషన్" ఏర్పాటుచేయాలని కోరుతూ ఒక విజ్ఞాపనం సమర్పించారు. వెంటనే సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ మండవ వెంకటేశ్వరరావు గారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విజ్ఞాపన పత్రంలోని విషయాన్ని యధాతంగా ఈ క్రింద పేర్కొనడం జరిగింది.
మహారాజశ్రీ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారికి నమస్కారములతో,
విషయము: తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణాలోని కమ్మకులంలో ఆర్ధికంగా వెనుకబడిన కమ్మవారి సంక్షేమం కోసం "కమ్మ సంక్షేమ కొర్పొరేషన్" లేదా "కమ్మ కొర్పొరేషన్" ఏర్పాటుచేయుట గురించి. యువనాయకుడిగా, సమాజంపట్ల పూర్తి అవగాహన సామాజికస్పృహతో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల అకుంఠితదీక్షతో, రాష్ట్రంలో అన్నివర్గాలను సమదృష్టితో సమభావంతో చూస్తూ, ప్రగతిపథంలో అన్నిరంగాల్లో మన తెలంగాణా రాష్ట్రాన్ని ముందుంచాలనే దృఢసంకల్పంతో తెలంగాణాలో నవశకానికి నాంది పలికిన మీకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మీరు సమాజంలోని అన్ని వర్గాలను కులాలను, దళితులు మైనారిటీలు వెనుకబడినవర్గాలు అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడినవారిని పేదలను ఆదుకుని, వాళ్లను అన్నివిధాలా అభివృద్ధిచేసి సమభావంతో అక్కునచేర్చుకుని ఆదరించే పనిలో భాగంగా చాలా కులాలకు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు, అభినందనీయం.
టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి!! హైకోర్టులో విచారణ!! డీజీపీ, ఎస్పీకి నోటీసులు
కాకతీయుల కాలంనుండి కూడా తెలంగాణా ప్రాంతంలో కమ్మవారి పాత్ర అన్నిరంగాలలో గణనీయమైనదని చరిత్రమీద పూర్తి అవగాహన ఉన్న మీకు కూడా తెలుసు.తరువాత కాలంలో జరిగిన తెలంగాణా సాయుధపోరాటంలో కూడా కమ్మవారి పాత్ర గణనీయమైనదే. ప్రధానంగా వ్యవసాయరంగాన్ని నమ్ముకుని ఎల్లప్పుడూ సామాజికస్పృహ సామాజికబాధ్యతతో అన్ని వర్గాలను అన్నిప్రాంతాలను సోదరభావంతో కలుపుకునిపోతూ, అందరిలో మమేకమై కష్టించి పనిచేసే తత్వంకలిగినవారు కమ్మవారు.
నేడు తెలంగాణారాష్ట్రంలో తెలంగాణా సమాజంలో కమ్మవారి జనాభా చాలా గణనీయమైన సంఖ్యలోనే ఉందనేది సర్వవిదితమే, కులాలవారీగా సరైన జనాభా గణాంకాలు బహుశా ప్రభుత్వం వద్ద ఉండిఉండవచ్చు. కమ్మకులం చట్టపరంగా అగ్రవర్ణానికి చెందినవారైనప్పటికీ, కమ్మవారిలో ఆర్ధికంగా బాగా వెనుకబడినవారు నిరుపేదలు కార్మికులు రైతుకూలీలు పూటగడవనివారూ ఎందరో ఉన్నారు. తెలంగాణాలో వ్యవసాయంతోపాటు సామాజికంగా రాష్ట్ర సమగ్రఅభివృద్ధికి సర్వతోముఖాభివృద్ధికి సంబంధించి అన్ని రంగాలలోనూ, సామాజికసేవాకార్యక్రమాలలోనూ కమ్మవారు తమవంతు బాధ్యతగా తమకర్తవ్యంగా తెలంగాణా మరియు తెలుగుజాతి అభివృద్ధిలో భాగస్వామ్యమై నిలుస్తున్నారు. కమ్మవారు ఎన్నో ఒడిదుడుకులు ఆటుపోట్లు ఇబ్బందులు ఎదుర్కొవడం జరిగింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీలాంటి యువనాయకత్వంలో స్వేశ్చ స్వాతంత్యాలతో, మీతోపాటు మేముసైతం అంటూ, మీవెంట మీఅడుగుల్లో అడుగులువేసి నడవడానికి ఎంతో ఆనందంతో సిద్ధంగా ఉన్నారు. గతకొన్ని దశాబ్దాలుగా దేశంలో మారిన రాజకీయ సామాజిక ఆర్ధిక అంశాల దృష్ట్యా కేవలం భూమిని వ్యవసాయరంగాన్నే నమ్ముకుని జీవిస్తున్న అగ్రవర్ణాలలోని వ్యవసాయాధారిత రైతుకుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా తయారైన పరిస్థితి విదితమే. పేరుకే అగ్రవర్ణాలుకానీ, అన్ని అగ్రవర్ణాలలో కూడా ఆర్థికంగా వెనుకబడినవాళ్లు నిరుపేదల సంఖ్య గణనీయమే. నేడు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత రాష్ట్రంలోని అన్ని వర్గాలలోని పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ, సమాజంలోని వివిధ కులాలలోని పేదల సంక్షేమం కోసం దరిదాపుగా అన్ని కులాలకు సంక్షేమ కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం చాలా సంతోషం. దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకే కాకుండా, అగ్రవర్ణాలలోని నిరుపేదలను ఆర్థికంగా వెనుకబడినవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఒక పెద్దన్న లాగా వివిధ వర్గాలకు కూడా సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లు ఏర్పాటుచేయడాన్ని, మీ ఔదార్యాన్ని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను.
తాడేపల్లికి చేరిన నగరి పంచాయితీ!! సీఎం కార్యాలయానికి వచ్చిన రోజా!! అడ్డం తిరిగిన కథ
అగ్రవర్ణానికి చెందిన కమ్మవారిలో కూడా ఆర్థికంగా వెనుకబడినవారు పూటగడవనివారు నిరుపేదలు ఎందరో ఉన్నారు, రాష్ట్రంలో అలాంటివి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. తెలంగాణలో కమ్మవారు చాలామంది వ్యవసాయ కూలీలుగా, రైతుకూలీలుగా, కార్మికులుగా పనిచేస్తూ ఆత్మగౌరవంతో గుంభనంగా బ్రతుకులు వెళ్లదీస్తున్నారు. అలాంటివారికి నేడు తమ పిల్లల చదువులకు ఫీజులు కట్టలేకపోవుచున్నవాళ్ళు, విద్యలో మెరిట్ ఉన్నాకూడా ఆర్థిక ఇబ్బందులతో చదువులను మధ్యలోనే ఆపేస్తున్నవాళ్లు చాలామంది ఉన్నారు. మరోపక్క ఉన్నతమైన విద్యలు అభ్యసించి, మంచి చదువులు చదువుకుని ఉద్యోగాలు దొరకక, సరమర్ధత ఉండికూడా ఆర్ధిక వనరులు లేకపోవడం వలన, స్వయంఉపాధి పథకాలు అందక ఎంతోమంది సతమతమవుతున్నారు. ఈ పరిస్థితులలో మీరు సహృదయంతో కమ్మకులంలోని ఆర్ధికంగా వెనుకబడినవాళ్లను, దారిద్ర రేఖకు దిగువున ఉన్న పేదకమ్మవారిని అన్నివిధాలా ఆదుకోవడానికి మరియు వారి సంక్షేమంకోసం "కమ్మ సంక్షేమ మరియు ఆర్ధిక సహాయం, అభివృద్ధి కొర్పొరేషన్" సత్వరమే ఏర్పాటుచేసి, తెలంగాణా చరిత్రలో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన తొలిముఖ్యమంత్రిగా మీరు నిలుస్తారని, తెలంగాణాలో కమ్మవారికి అండగా ఉన్నామంటూ భరోసా ఇచ్చి, వారిని కూడా రాష్ట్రంలోని ఇతర వర్గాలు కులాలకు చెందిన అందరితో సమానంగా ఆదరిస్తారని, తెలంగాణాలో ఒక ప్రజాప్రతినిధిగా మీకు మనవి చేస్తున్నాను అని మండవ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం మరో భారీ కుట్ర!!
తాడేపల్లికి చేరిన నగరి పంచాయితీ!! సీఎం కార్యాలయానికి వచ్చిన రోజా!! అడ్డం తిరిగిన కథ
టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి!! హైకోర్టులో విచారణ!! డీజీపీ, ఎస్పీకి నోటీసులు
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!
చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి
#Revanthreddy #Telangana #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.