ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు!! ఆఖరి తేదీ!! 9144 ఖాళీలతో ప్రకటన విడుదల!!

Header Banner

ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు!! ఆఖరి తేదీ!! 9144 ఖాళీలతో ప్రకటన విడుదల!!

  Tue Mar 19, 2024 21:49        Employment

రైల్వేలో కొలువుల జాతర ప్రారంభమైంది. లోకో పైలట్ దరఖాస్తులు ముగిశాయి. ఇప్పుడు టెక్నీషియన్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటికి ఎంపికైనవారు ఆకర్షణీయ వేతనం పొందవచ్చు! గ్రేడ్-1, గ్రేడ్-3.. రెండు విభాగాల్లోనూ 9144 ఖాళీలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్-3లోని 8052 పోస్టులకు పదో తరగతి తర్వాత నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు. పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.

 

అర్హతలు, ఆసక్తి ఉన్నవారు టెక్నీషియన్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ)ల వారీ ఉంటాయి. పరీక్ష మాత్రం అందరికీ ఉమ్మడిగానే నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏదో ఒక ఆర్ఆర్బీ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. అందులోని జోన్ల ప్రాధాన్యాన్ని ఎంచుకోవాలి. ఈ పరీక్షలను తెలుగు మాధ్యమంలోనూ రాసుకోవచ్చు. గ్రేడ్-1, గ్రేడ్-3 రెండు పోస్టులకూ అవసరమైన విద్యార్హతలు ఉన్నవారు కావాలనుకుంటే రెండింటికీ విడిగా దరఖాస్తు చేసుకుంటే పరీక్ష రాయడానికి వీలుంటుంది.

 

ఇంకా చదవండి: APPSC మెయిన్స్ రద్దు తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం!! అత్యవసరంగా లంచ్ మోషన్??

 



   #AndhraPravasi #Employment #India #Groupsexam #Application #Government