ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!

Header Banner

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్!! హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే!!

  Fri Mar 22, 2024 06:23        Politics

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సీఎం నివాసంలో విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఈడీ బృందం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తనతో పాటు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్ళింది. మరోవైపు, ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రభస సృష్టిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో ఆ ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు.

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటివరకు పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం ఈ కేసులోనే కీలక మలుపుగా మారింది. ఈ ఢిల్లీ లిక్కర్ కేసు విచారణకు రావాలని ఈడీ అధికారులు 9 సార్లు సమన్లు జారీ చేసినా.. ఆయన హాజరు కాలేదు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారని.. గత కొన్ని రోజుల నుంచి ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు నేతలు కూడా పేర్కొంటున్నారు. అన్నట్టుగానే గురువారం రాత్రి కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారుల బృందం రెండున్నర గంటల తర్వాత ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు కేజ్రీవాల్ భార్యకు సమాచారం అందించారు. 

 

ఎన్నికల బాండ్ల వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించిన SBI!! ఏ దాత ఎంత విరాళం..

 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కుపోయారు. ఈ విషయం ముందస్తు బెయిట్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. కేజ్రీవాల్‌కు అరెస్ట్‌ నుంచి విముక్తి లేదని హైకోర్టు వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే అరవింద్ కేజ్రీవాల్‌ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ED బృందం సిఎం కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. అరెస్ట్ తర్వాత ఈ ఢిల్లీ మద్యం కేసు గురించి ఈడీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఢిల్లీ మద్యం పాలసీ విధానం 2022 రూపకల్పన చేసే సమయంలో కొందరు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిసి కుట్ర చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను కుట్రదారుగా ఈడీ అభివర్ణించింది. ఈ కేసులో సౌత్ గ్రూప్‌కు లబ్ధి చేకూర్చేలా ఢిల్లీ మద్యం పాలసీ విధానం 2022 ను రూపొందించారని ఈడీ ప్రధాన ఆరోపణ చేస్తోంది.

 

ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై విచారణకు ఈసీ ఆదేశం!! చిలకలూరిపేటలో ప్రధాని మోదీ సభలో..

 

మద్యం పాలసీ విధానంలో మార్పులు చేర్పులు చేసిన దానికి ప్రతిఫలంగా సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిందని పేర్కొంది. వాటిని 2022 గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ వినియోగించుకుందని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఈడీ అధికారులు సౌత్ లాబీగా పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన కొందరు నిందితులు.. మరికొందరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు ఉందని.. ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సందర్భంగా నోట్‌లో చేర్చారు.

 

ఇవి కూడా చదవండి:

వైసీపీ పై టీవీ -ఎఫెక్ట్!! జగన్ కు ఓటు వేయాలంటూ... కలెక్టర్ స్పందనతో సస్పెండ్!!

 

ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు!! నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసమే.. జయప్రకాష్ నారాయణ

 

 కొడాలి నాని, వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు!! బోడె ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!!

 

Evolve Venture Capital  

 

నిమ్మగడ్డ రమేష్‌ కీలక వ్యాఖ్యలు!! ప్రభుత్వ సలహాదారులు రాజకీయ చర్చలో! ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియ అపహాస్యం..

 

ఆ దేశంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. లేదంటే శిక్ష!! అరె అబ్బాయిలు సర్దేసుకొండి బట్టలు ఇంకా!

 

సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఈసీ!! హద్దు దాటారో డేంజర్ బెల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 

 

 


   #NewDelhi #Arvindkejriwal #KejriwalArrest #DelhiChiefMinister #AndhraPravasi #Pravasi #TeluguMigrants