తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం!! చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ!!

Header Banner

తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం!! చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ!!

  Mon Mar 25, 2024 05:53        Politics

తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం

టీడీపీ గెలుపుతోనే మాదిగల గెలుపు: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ భేటీ - మాదిగల సమస్యలపై చర్చ

ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన మంద కృష్ణ మాదిగ

దళితులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని కోరిన మందకృష్ణ

 

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

అమరావతి:- తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదిగ వర్గ ప్రజల అభ్యున్నతికి మొదటి నుంచీ పనిచేసిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం విజయంలో మాదిగలు కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలో టీడీపీ అధినేతతో మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడుకు పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చారు.

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్ట మొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని మందకృష్ణ కోరారు. రాజ్యాంగ బద్ద సంస్థల్లో మాదిగ వర్గానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే అన్ని కార్పొరేషన్ లలో, నామినేటెడ్ పదవుల్లో మాదిగ వర్గానికి పెద్ద ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు రద్దు చేసిన అన్ని పథకాలు తిరిగి ప్రారంభించాలని విన్నవించారు. ఎన్డీయేకు తమ మద్దతు ఉంటుందని మంద కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ....40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజికవర్గం ఆదరిస్తోందని అన్నారు.

 

ఇంకా విడుదల కానీ యూఎస్ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు! విద్యార్థుల్లో టెన్షన్!

 

అలాంటి మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు తాను ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తెలుగుదేశం గెలుపు మాదిగల గెలుపు అవుతుందని అన్నారు. ప్రభుత్వంపై తెలుగు దేశం ఎంత గట్టిగా పోరాడుతుందో....అంతకంటే గట్టిగా ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తోందని అన్నారు. మాదిగ సామాజికవర్గాన్ని అధికారంలో భాగస్వాములు చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాదిగ సమస్యలపై చంద్రబాబుతో మందకృష్ణ ప్రత్యేకంగా చర్చించారు. అధికారంలోకి వచ్చిన తరవాత మాదిగ వర్గానికి న్యాయంచేయాలని కోరారు. దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

 

ఇవి కూడా చదవండి: 

విజయసాయిరెడ్డి ట్వీట్ పై పలు ప్రశ్నలు సంధించిన కనకమేడల!! సమాధానాలు ఉన్నాయా??

 

విజయవాడ బస్టాండ్ లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం!! గంటపాటు జరిగిన ఆందోళనతో...

 

ఈనెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన ఖరారు!! రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గం..

 

అమెరికా: న్యూజెర్సీలో నాట్స్ ఆధ్వర్యంలో పోలీస్ ఆఫీసర్లతో విజయవంతంగా “కాఫీ విత్ కాప్” కార్యక్రమం! ఆసక్తికర సందేహాలకు పోలీసుల సలహాలు!

 

Evolve Venture Capital  

 

18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!

 

బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి! 

 

కమ్మ నేతల ఒత్తిడితోనే  కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #NaraChandraBabuNaidu #MRPS #MandhaKrishnaMadiga #2024JaganNoMore #JaganCastePolitics #YCPCheepPolitics #FailedCMJagan #FailedSystem #AndhraPravasi #Pravasi #Election2024 #apelection #andhrapradesh #BabuSuper6