చైనా ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్రం భారీ ప్రణాళిక! ₹42,000 కోట్లతో ఎలక్ట్రానిక్స్ విస్తరణకు శ్రీకారం!

Header Banner

చైనా ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్రం భారీ ప్రణాళిక! ₹42,000 కోట్లతో ఎలక్ట్రానిక్స్ విస్తరణకు శ్రీకారం!

  Sat Nov 23, 2024 16:22        Others

మొబైళ్లు, లాప్టాప్లతో పాటు వాటి విడిభాగాలను కూడా దేశీయంగా తయారు చేసే నిమిత్తం కంపెనీలకు 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.42,000 కోట్ల) ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. వీటి కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశీయ పరిశ్రమకు ఊతం ఇచ్చేందుకే ఈ ప్రోత్సాహకాలు అందివ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ గత ఆరేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగి 2024లో 115 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.66 లక్షల కోట్ల)కు చేరింది. యాపిల్, శామ్సంగ్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మనదేశంలో మొబైళ్ల తయారీ పెంచడం ఇందుకు తోడ్పడింది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల ఎగుమతి పరంగా చూస్తే, ప్రపంచంలోనే నాలుగో స్థానంలో మనదేశం ఉంది. దేశీయంగా ఆయా పరికరాల అసెంబ్లింగ్ ప్రక్రియే ఎక్కువగా జరుగుతోందని, వాటి తయారీకి కావాల్సిన విడిభాగాల కోసం చైనా లాంటి దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుందనే విమర్శ ఉంది. అందుకే విడిభాగాలు కూడా ఇక్కడే తయారు చేసేలా చూసేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



. రాబోయే 2-3 నెలల్లో ప్రకటించనున్న పథకం కింద, ఇందుకోసం ప్రత్యేక ప్రోత్సహకాలు వెల్లడవుతాయి. ఈ పథకానికి త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావొచ్చని సమాచారం. ఈ పథకానికి అర్హత సాధించిన దేశీయ లేదా అంతర్జాతీయ సంస్థలకు 4-5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.33,600-42,000 కోట్ల) శ్రేణిలో ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది. ఈ ప్రోత్సాహక పథకం వల్ల ప్రింటెడ్ సర్క్యుట్ బోర్డులు లాంటి కీలక విడిభాగాల తయారీ పెరగడమే కాకుండా.. వివిధ రకాల ఎలక్ట్రానిక్స్కు సంబంధించి దేశీయంగా సరఫరా మరింత విస్తృతం అవుతుందని ఆ వర్గాలు తెలిపాయి. 2030 కల్లా ఎలక్ట్రానిక్స్ తయారీని 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.42 లక్షల కోట్ల)కు పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో విడిభాగాల తయారీ విలువ 150 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12.60 లక్షల కోట్లు) అని నీతిఆయోగ్ నివేదిక చెబుతోంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #mobile #laptops #manufacturing #union #budgets #planning #todaynews #flashnews #latestupdate