మెటాస్టాసిస్ మర్మాన్ని ఛేదించిన భారత శాస్త్రవేత్తలు! క్యాన్సర్ కణాల వ్యాప్తిపై విప్లవాత్మక పరిశోధన!

Header Banner

మెటాస్టాసిస్ మర్మాన్ని ఛేదించిన భారత శాస్త్రవేత్తలు! క్యాన్సర్ కణాల వ్యాప్తిపై విప్లవాత్మక పరిశోధన!

  Sat Nov 23, 2024 17:21        Health

క్యాన్సర్ కణాల్లోని వైరుధ్యాలు, పరిసరాలతో అవి సాగించే చర్యలు.. వాటి కదలికలను ఎలా తీర్చిదిద్దుతాయన్నది భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్యాన్సర్ వ్యాప్తి గురించి మరిన్ని వివరాలను వెలుగులోకి తీసుకురావడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఒక ప్రదేశంలో పుట్టే క్యాన్సర్.. దూరంగా ఉండే అవయవాలకూ క్రమంగా వ్యాపిస్తుంది. దీన్ని మెటాస్టాసిస్ అంటారు. చాలా ఏళ్ల పాటు శాస్త్రవేత్తలకు ఇది అంతుచిక్కలేదు. దీనికి ప్రేరేపించే అంశాలు, నడిపించే యంత్రాంగాల గుట్టును ఇప్పుడిప్పుడే వారు విప్పుతున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. క్యాన్సర్ కణాలు తమ పరిసరాల జీవరసాయన, భౌతిక లక్షణాలకు అనుగుణంగా తమ వలస తీరుతెన్నులను నిర్దేశించుకుంటున్నట్లు తేల్చారు. అండాశయ క్యాన్సర్కు సంబంధించిన రెండు రకాల కణాలు ఓవీసీఏఆర్-3, ఎస్్క-ఓవీ-3లను వీరు విశ్లేషించారు. ఇవి భిన్న రకాల ఉపరితలాలకు అనుగుణంగా తమ కదలికలను సర్దుబాటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఈ రెండు రకాల కణాలు అన్ని దిశల్లోకి చిన్నగా కదులుతున్నట్లు గమనించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #cancer #spreding #scientists #INDIAN #todaynews #flashnews #latestupdate