చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచిస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి!

Header Banner

చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచిస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి!

  Sat Nov 23, 2024 18:36        Life Style

ప్రస్తుత రోజుల్లో చాలామంది ప్రతీ చిన్న విషయానికి కూడా అతిగా రియాక్ట్ అవుతుంటారు. చిన్న సమస్యను కూడా భూతద్దంలో చూసి, ఓవర్ రియాక్ట్ అవుతారు. ఈ ఆలోచనలు చేసే వారు అనారోగ్యం బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందినా, పదే పదే ఎక్కువగా ఆలోచిస్తున్నా.. శారీరక, మానసిక సమస్యలకు కారణం అవుతుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పాజిటివ్ గా ఆలోచించడం అలవాటు చేసుకుంటే.. జీవితం పాజిటివ్గా సాగుతుంది. ఒకవేళ నెగిటివ్ థింకింగ్ ఎక్కువైతే అన్ని ఇబ్బందులుగానే, కష్టాలుగానే కనిపించి, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ మానసిక సమస్యలు తలెత్తితే ఎంత మందిలో ఉన్నా ఒంటరిగానే ఫీలవుతారు. వారిని ఒంటరితనం చుట్టుముట్టేస్తుంది. దీనివల్ల తీవ్ర ఒత్తిడికి గురి అవుతారు. క్రమంగా తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతారు. అందుకే దేని గురించి అయినా అవసరానికి మించి ఆలోచించకూడదు. అతిగా ఆలోచించడం వల్ల మానసిక ఆరోగ్యానికే కాదు, శారీరక ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఓవర్ రియాక్ట్ వల్ల నిద్రలేమి, ఆందోళన, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది మెదడు కణాలపై ఒత్తిడిని పెంచి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు.

 

అతి ఆలోచనలు వేధిస్తున్నప్పుడు ఏదైనా సినిమా చూడండి. మహిళలైతే కొత్త వంటలు ప్రయత్నించండి. పెయింటింగ్, డాన్స్ వంటివి చేయండి. ఇతర ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఇష్టమైన పని చేస్తూ ఉండండి. ధ్యానం అనేది మనస్సును ప్రశాంతంగా ఉంచి, మైండ్ను కంట్రోల్ చేస్తుంది. చిన్న చిన్న తప్పుల విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. ఇలా చేస్తే ఒంటరితనం అనే ఫీలింగ్ రాదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అతిగా ఆలోచించడం మానేసి, భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడకుండా ప్రస్తుత క్షణంలో సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 

 


   #AndhraPravasi #LifeStyle #OverThinking #Health