తుంగభద్ర డ్యాం గేట్ల మార్పిడిపై కీలక నిర్ణయం! నిపుణుల నివేదిక ఆధారంగా అభివృద్ధికి కసరత్తు!

Header Banner

తుంగభద్ర డ్యాం గేట్ల మార్పిడిపై కీలక నిర్ణయం! నిపుణుల నివేదిక ఆధారంగా అభివృద్ధికి కసరత్తు!

  Sat Nov 23, 2024 20:52        Others

తుంగభద్ర జలాశయం 33 గేట్ల మార్పిడికి కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధులు తమ సమ్మతిని తెలియజేశారు. హొసపేటె పరిధి టీబీ డ్యాం ప్రాంతంలో శుక్రవారం తుంగభద్ర మండలి అధ్యక్షుడు ఎస్ఎన్ పాండే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బోర్డు ఆంధ్ర ప్రతినిధిగా చీఫ్ ఇంజినీర్ నాగరాజ్, కర్ణాటక ప్రతినిధిగా జలవనరుల శాఖ కార్యదర్శి కృష్ణమూర్తి కులకర్ణి, కార్యదర్శి ఒ.రామకృష్ణారెడ్డి, మునిరాబాద్ చీఫ్ ఇంజినీర్ హనుమంతప్ప దాసర్, ఎస్ఈలు బసవరాజ్, నీలకంఠరెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రతినిధి అనిల్కుమార్, కేంద్ర జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి రిచా మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు. వీరు డ్యాం గేట్ల మార్పిడిపై సుదీర్ఘంగా చర్చించారు. నిపుణుడు బజాజ్ ఇచ్చిన నివేదికపై చర్చించిన తరార్వత గేట్ల మార్పిడిపై రెండో అభిప్రాయం తీసుకోవడం మంచిదని సభ్యులు అభిప్రాయపడ్డారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



దీనికోసం జాతీయ జలాశయ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ)కు లేఖ రాయాలని, డిసెంబరులో ఆ సంస్థ నిపుణులను ఆహ్వానించి.. వారి నివేదిక ఆధారంగా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొత్తగేట్లు పాత తరహాలోనే ఉండాలా..? లేదా కొత్త సాంకేతికతతో సిద్ధం చేయాలా అనే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 33 గేట్లనూ దశలవారీగా మార్చడం ఉత్తమమన్న అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. అందుకు కావాల్సిన నిధులను మార్చిలో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల బడ్జెట్లలో ప్రతిపాదించాలని కృష్ణమూర్తి కులకర్ణి పేర్కొన్నారు. తుంగభద్ర జలాశయంలో సుమారు 33 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయిందని.. దాన్ని తొలగించడం అసాధ్యమని ఆయన తెలిపారు. దీంతో గంగావతి తాలూకా నవలి వద్ద 33 టీఎంసీల సామర్థ్యం గల సమాంతర జలాశయ నిర్మాణం చేపడుతున్నామని, దానికి మండలి అంగీకారం తెలపాలని కోరారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రతినిధి వ్యతిరేకించారు. హెచ్చెల్సీ వరద కాలువకు ప్రతిపాదన సిద్ధం చేయాలని కర్ణాటక ప్రతినిధి కోరారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో వాళ్లందరి పింఛన్లు కట్! ఈ తప్పు అస్సలు చేయొద్దు! సర్కార్ కీలక నిర్ణయం!

 

ఈజీగా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ పర్ఫెక్ట్! ఒకసారి ట్రై చేయండి!

 

శ్రీశైలంలో భక్తులకు గుడ్ న్యూస్! ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం! ఎప్పటి నుంచి అంటే!

 

ఈరోజు 23/11 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

  

25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైకాపా ప్రభుత్వం కాజేసిందిగత ప్రభుత్వంపై మంత్రి ఆగ్రహం!

    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #andhrapravasi #thungabadra #dam #repair #newdevelopment #project #todaynews #flashnews #latestupdate