టీటీడీ ఉద్యోగులకు త్వరలోనే నేమ్‌ బ్యాడ్జ్‌! చైర్మన్‌ బీఆర్‌ నాయుడు కీలక నిర్ణయం!

Header Banner

టీటీడీ ఉద్యోగులకు త్వరలోనే నేమ్‌ బ్యాడ్జ్‌! చైర్మన్‌ బీఆర్‌ నాయుడు కీలక నిర్ణయం!

  Wed Dec 11, 2024 15:57        Devotional

టీటీడీ ఉద్యోగులు అందరికీ తొందరలోనే నేమ్‌ బ్యాడ్జ్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని బోర్డు చైర్మన్‌ బీఆర్ నాయుడు తెలిపారు. కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నేమ్‌ బ్యాడ్జ్‌ ఇవ్వడం ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని సులువుగా గుర్తించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.

 

ఇంకా చదవండినామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే? 

 

శ్రీనివాసుడి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా, అంకితభావంతో టీటీడీ ఉద్యోగులు ప్రవర్తించేందుకు ఈ బ్యాడ్జ్‌ విధానం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నానని బీఆర్‌ నాయుడు తెలిపారు. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ నేమ్‌ బ్యాడ్జిని త్వరలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఉచిత సర్వదర్శనం కోసం ఒక కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. అదే టైమ్‌ స్లాటెడ్‌ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. బుధవారం నాడు 67,284 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా హుండీకి రూ. 4.27 కోట్లు ఆదాయం వచ్చింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Devotional #Tirumala #TTD #Tirupati