మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

Header Banner

మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..

  Wed Dec 11, 2024 16:28        Politics

ప్రయత్నాలు మొదలు పెట్టిన వెంటనే ఫలితాలు రావని, నిరంతర ప్రయత్నాలతోనే ఫలితాలను రాబట్టుకోవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ నిరంతర ప్రయత్నం, కృషి వల్లే గూగుల్ కంపెనీతో ఎంవోయూ కుదిరిందని వివరించారు. ఈమేరకు ఏపీ సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో మంత్రి నారా లోకేశ్ ను చంద్రబాబు మెచ్చుకున్నారు. గూగుల్ కంపెనీ ఏర్పాటుకు కుదిరిన ఎంవోయూతో విశాఖలో అభివృద్ధి మరింత ఊపందుకుంటుందని చెప్పారు. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు ఉంటాయని చెప్పారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వ లక్షణం అని అన్నారు. హార్డ్‌ వర్క్‌ ముఖ్యం కాదు... స్మార్ట్‌ వర్క్‌ కావాలని చెప్పారు. ప్రజాచైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం - నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు! ఆ జిల్లాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం!



ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రానికి పెట్టుబడులు

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పారిశ్రామిక పాలసీలతో ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది దేశవిదేశాలకు చెందిన పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని వివరించారు. కొత్త ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తోందని తెలిపారు. గూగుల్ కంపెనీతో ఎంవోయూ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులతో అమరావతిలో భేటీ అయినట్లు సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కోలీ నేతృత్వంలో గూగుల్ ప్రతినిధి బృందం తనను కలిసిందన్నారు. భారత్ లో వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను వారు తనకు వివరించారని, దేశంలోని వివిధ రాష్ట్రాలను కాదని ఏపీతో గూగుల్ ఒప్పందం కుదుర్చోవడం గర్వంగా ఉందని చెప్పారు. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గూగుల్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!

 

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting