సీఎం చంద్రబాబును, ఎన్ఆర్ఐ మినిస్టర్ ను కలిసిన వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు! ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ఆధ్వర్యంలో! బిజీ షెడ్యూల్ లోను ఎన్నారై లకు ప్రాధాన్యత పై అమిత ఆనందం!

Header Banner

సీఎం చంద్రబాబును, ఎన్ఆర్ఐ మినిస్టర్ ను కలిసిన వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు! ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ఆధ్వర్యంలో! బిజీ షెడ్యూల్ లోను ఎన్నారై లకు ప్రాధాన్యత పై అమిత ఆనందం!

  Wed Dec 11, 2024 19:15        Politics

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు.

ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికలకు ఎన్నారైలు ఎంతో కష్టపడ్డారు. ఎన్నికలకు నెలలు ముందుగా భారత్ కు వచ్చి పార్టీ విజయానికి తోడ్పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు వారానికి ఒక సారి ఎన్నారైలను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. 

 

అందులో భాగంగా ఈ వారం ఆస్ట్రేలియా, అమెరికా, జర్మని, నెదర్ లాండ్స్ మరియు స్కాట్ ల్యాండ్ నుండి వచ్చిన ఎన్నారైలు ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. అక్కడ సీఎం చంద్రబాబు ఎన్నారై లను కలిసి వారిని అభినందించారు. 

 

ఈరోజు కలిసిన వారి వివరాలకు లోకి వెళితే ఆస్ట్రేలియా నుండి దాసరి విశ్వనాథ్ మరియు వారి పాప, అమెరికా నుండి పొన్నగంటి సత్య, కర్నాటి లావణ్య, కృష్ణ ప్రియ, జర్మని నుండి సుమంత్, వారి సతీమణి మరియు వారి 2సం.ల పాప, రాహుల్, నెదర్ లాండ్స్ నుండి బొల్లిని దినకర్, స్కాట్ ల్యాండ్ నుండి కుర్ర అనిల్ కుమార్ లు సీఎం చంద్రబాబు గారిని కలిశారు. ఇలా సీఎం గారు తమ కోసం సమయం కేటాయించి వారిని కలిసి విదేశాలలో వారు చేస్తున్న పనుల గురించి ఓపిగ్గా అడిగి తెలుసుకుని, వారు వారు పార్టీకి చేసిన కృషిని అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని ఎన్నారైలు మరియు వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వెల్లడించారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదలఎప్పుడు అంటే? 

 

వీరు అందరూ సీఎం చంద్రబాబు గారితో పాటు ఎన్నారై మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా సచివాలయంలోని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస రావు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు, వారు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాల వివరాలు తెలుసుకొని పలు సూచనలు చేశారు. 

 

అలాగే మంగళగిరి లో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, మరియు గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్ధి మరియు ఎక్స్ మినిస్టర్ అయిన ఆలపాటి రాజా ను కూడా కలిశారు. 

 

ఎన్నికల కోసం ఎంతో కష్టపడిన ఎన్నారై లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారంలో ఒక రోజు సమయం ఇచ్చి సీఎం గారి బిజీ షెడ్యూల్ లో వారి కోసం సమయం కేటాయించి వారిని కలిసి అభినందనలు తెలియజేయడం ఎన్నారైలకు ఎంతో ఆనందం అని ఎన్నారై టీడీపీ సెల్ అధ్యక్షులు డా. రవి వేమూరి మరియు కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss

 

నేడు (11/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!

 

ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!

 

చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Politics #TDP #CBN #NRIs #World