Header Banner

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

  Wed Apr 23, 2025 14:47        Politics

తెదేపా నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి (Veeraiah Chowdary) హత్య ఘటనలో రాజకీయ కోణం వెలుగులోకి వచ్చింది. నాగులుప్పలపాడు మండల వైకాపా నేత పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ నేత పరారీలో ఉన్నాడు. అతడు వైకాపా హయాంలో రేషన్ బియ్యం వ్యాపారం చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చాకా అదే దందా కొనసాగించాడు. ఆయన వ్యాపారానికి వీరయ్య చౌదరి అడ్డుకట్ట వేశారు. దీంతో తెదేపాలోకి వచ్చేందుకు యత్నించాడు. అతడు రాకుండా వీరయ్య చౌదరి అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో నిందితుల కోసం 12 బృందాలతో పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరికి మద్యం సిండికేట్ వ్యాపారిగా పేరుంది. స్థిరాస్తి వ్యాపారం చేసే ఈయన బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధికార ప్రతినిధిగా గత ఎన్నికల్లో పనిచేశారు.

 

ఇది కూడా చదవండి: కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఒంగోలు రెవెన్యూ కాలనీలోని ఓ భవనం రెండో అంతస్తులో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్కు వెళ్లిన ఆయన మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయానికి తిరిగొచ్చారు. సాయంత్రం 7.35 గంటల సమయంలో రెండు ద్విచక్రవాహనాలపై ముఖాలకు రుమాళ్లు కట్టుకొని నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వస్తూనే వీరయ్య చౌదరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఛాతీ, గొంతు, పొట్టపై పదిహేనుసార్లు కత్తితో పొడిచి పారిపోయారు. ఆ సమయంలో వీరయ్య వెంట ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నారు. అతని కేకలు విని పక్కన భవనంలో నుంచి ఓ యువకుడు బయటికి రాగా.. నిందితులు కత్తితో బెదిరించి పరారయ్యారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని తొలుత కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations