Header Banner

కొత్త కారు కొంటున్నారా..? మిడిల్ క్లాస్ వారికి మంచి ఆప్షన్స్! అతి తక్కు ధరకే రాబోతున్న టాప్‌ 4 మోడల్స్‌ ఇవే..

  Sun Apr 20, 2025 12:53        Auto

కొత్త కారు కొనే చాలా మంది ఆలోచించేది ఒకటే.. బెస్ట్‌ బడ్జెట్‌, టాప్‌ ఫీచర్లు. మార్కెట్‌లో అడ్వాన్స్‌డ్‌ ఆప్షన్లతో అందుబాటు ధరలో ఉండే ఆప్షన్లు పరిశీలిస్తుంటారు. మీరూ రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే మార్కెట్లో ప్రస్తుతం చాలా మంచి ఆప్షన్లు ఉన్నా, కొద్ది రోజులు ఆగడం చాలా మంచిది. ఎందుకంటే బడ్జెట్ సెగ్మెంట్‌లో కొన్ని అద్భుతమైన కొత్త కార్లు త్వరలో లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా 2025లో నాలుగు మోడల్స్‌ రూ.10 లక్షలలోపు (ఎక్స్-షోరూమ్) ధరల్లో రావచ్చు. ఇవి అప్‌డేటెడ్ డిజైన్లు, ఎక్స్‌ట్రా ఫీచర్లు, ప్రాక్టికల్ పర్ఫార్మెన్స్‌తో రాబోతున్నాయి. హ్యుందాయ్ తన నెక్స్ట్ జనరేషన్ వెన్యూను 2025 పండుగ సీజన్‌లో (రెండో అర్ధభాగంలో) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్ తన సిగ్నేచర్ బాక్సీ డిజైన్‌ను కంటిన్యూ చేస్తుంది, కానీ మరింత మోడర్న్ లుక్, అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్స్‌తో వస్తుంది. ఇంజిన్లలో ప్రస్తుత లైనప్‌ 1.2-లీటర్ MPi పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ కంటిన్యూ అవుతాయి. హ్యుందాయ్ డాష్‌బోర్డ్‌ను రిఫ్రెష్ చేసి, అపోల్స్ట్రీని మెరుగుపరిచి, క్యాబిన్‌కు మరింత ప్రీమియం ఫీల్, యాంబియంట్ లైటింగ్‌ను కూడా అందించే అవకాశం ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.8 లక్షల వరకు ఉండవచ్చు. రెనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పరంగా అప్‌డేట్ అవుతోంది. రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్లోకి రావచ్చు.

 

ఇది కూడా చదవండి: పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేవారికి బిగ్ అలర్ట్.. ప్రభుత్వం కీలక మార్పులు! వారికి ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే.!

 

ఇందులో అవే పాత ఇంజిన్లు 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (72 bhp), 1.0-లీటర్ టర్బో పెట్రోల్ (100 bhp) ఉంటాయి. బయటి డిజైన్‌లో చిన్న మార్పులే చేసినా, క్యాబిన్ లోపల కొత్త టెక్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ కానుంది. ధరలు సుమారు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. క్యామోఫ్లేజ్‌తో టెస్టింగ్ చేస్తున్నప్పుడు కనిపించిన ఫొటోలను బట్టి, చిన్న స్టైలింగ్ మార్పులతో పాటు, ఇన్ఫోటైన్‌మెంట్, సేఫ్టీ ఫీచర్లలో కూడా అప్‌గ్రేడ్స్‌ ఉండొచ్చని తెలుస్తోంది. టాటా మోటార్స్ అప్‌డేటెడ్ ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌ను (Tata Motors Updated Altroz Hatchback) లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి వస్తుందని అంచనా. ఈ ఫేస్‌లిఫ్టెడ్ ఆల్ట్రోజ్‌లో డిజైన్‌లో చిన్న మార్పులు, కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్లు ఉంటాయి. ఇంజన్ ఆప్షన్లు సేమ్ ఇప్పటి వెర్షన్ లాగానే 1.2-లీటర్ పెట్రోల్ (86 bhp/113 Nm), 1.5-లీటర్ డీజిల్ (90 bhp/200 Nm)గా ఉంటాయి. ధర సుమారు రూ.7 లక్షల నుంచి రూ.11.50 లక్షల మధ్య ఉండవచ్చు. మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు, కానీ పోటీ ఎక్కువగా ఉన్న ఈ సెగ్మెంట్‌లో ఆల్ట్రోజ్‌ను అప్‌డేటెడ్‌గా ఉంచే లక్యంతో కంపెనీ ఈ వేరియంట్ తీసుకొస్తోంది. నిస్సాన్ సంస్థ రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా సరికొత్త MPVని అభివృద్ధి చేస్తోంది. ఇది 2025 దీపావళి సమయంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇది ట్రైబర్‌ ప్లాట్‌ఫామ్, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తోనే వచ్చినా, డిజైన్ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్ ఇందులో ఉంటుంది. పెద్ద 8-అంగుళాల టచ్‌స్క్రీన్ (ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో), 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ వంటి ఫీచర్లతో రానుంది. ధర సుమారు రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. ఇది ఫ్యామిలీలకు అందుబాటు ధరలో లభించే మల్టీ పర్పస్‌ వెహికల్‌ (MPV) అవుతుంది.

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Car #Offer #NewCar #SUv #Hondacar