Header Banner

నిజాయితీగా సమాధానం చెప్పడంతో 40 సెకన్లలోనే వీసా రిజెక్ట్.. ఓ భారతీయుడి ఆవేదన!

  Thu Apr 17, 2025 12:55        U S A

అమెరికా వీసా ఇంటర్వ్యూలో ఉన్నది ఉన్నట్లు చెప్పడంతో తనకు వీసా తిరస్కరించారంటూ ఓ భారతీయుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. నిజాయితీగా సమాధానం చెప్పడమే తన తప్పిదమని అన్నాడు. కేవలం 40 సెకన్ల వ్యవధిలోనే తన వీసా దరఖాస్తును తిరస్కరించారని వివరించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతీయ యువకుడు ఒకరు ఇటీవల అమెరికా వీసా కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. కాన్సులర్ అధికారి అడిగిన ఓ ప్రశ్నకు నిజాయితీగా జవాబు చెప్పాడు. ఆ సమాధానం విన్న వెంటనే సదరు అధికారి ఎలాంటి లోతైన విచారణ లేకుండామరే ఇతర ప్రశ్న వేయకుండా తన వీసా దరఖాస్తును తిరస్కరించాడని చెప్పారు. కేవలం 40 సెకన్లలోనే వీసా నిరాకరిస్తున్నట్లు చెప్పారని వాపోయాడు.

 

ఇది కూడా చదవండి: అమరావతి పర్యటన.. ప్రధాని మోదీ షెడ్యూల్‌ ఖరారు.!

 

ఇంత తక్కువ సమయంలోఅదీ తాను నిజాయితీగా బదులిచ్చిన తర్వాత వీసా తిరస్కరించడం పట్ల అతను ఆశ్చర్యంతీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. తన నిజాయితీ బహుశా ప్రతికూలంగా మారి ఉండవచ్చని అతను అభిప్రాయపడ్డాడు. ఆ యువకుడు ఏ తరహా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు.. అధికారి అడిగిన ప్రశ్న, దానికి యువకుడు ఇచ్చిన జవాబు ఏమిటనే వివరాలను అతడు వెల్లడించలేదు. ఈ పోస్ట్ తో అమెరికా వీసా ప్రక్రియల గురించి, ఇంటర్వ్యూల సమయంలో అధికారుల నిర్ణయాధికారం గురించి నెట్టింట చర్చకు దారితీసింది. కొందరు అతనికి మద్దతు తెలుపగా, మరికొందరు వీసా తిరస్కరణకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

 

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

 

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!

 

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

 

తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #H1BVisa #India #Students #USANews #Government #Update #H1B