Header Banner

ట్రంప్‌ సంచలనం.. యూఎస్‌ నుంచి 5 లక్షల మంది బహిష్కరణ.. మాస్టర్ ప్లాన్.?

  Sat Mar 22, 2025 12:14        U S A

USA: డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వ‌ల‌స‌ల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే అక్ర‌మ‌వ‌ల‌స‌దారుల‌పై ట్రంప్ స‌ర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. వారిని దేశం నుంచి వెళ్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు తాత్కాలిక వ‌ల‌స‌దారుల‌పై ట్రంప్ క‌న్నెర్ర చేశారు. దేశంలో తాత్కాలిక నివాస హోదాను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంచ‌ల‌న నిర్ణ‌యంతో క్యూబా, హైతీ, నిక‌రాగ్వా, వెనిజులా దేశాల‌కు చెందిన దాదాపు 5.30 ల‌క్ష‌ల మంది పౌరులు అమెరికా వీడ‌నున్నారు.

 

ఇది కూడా చదవండి: అమెరికా: భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన.. కచ్చితంగా అలా చేయాల్సిందే.!

 

దాదాపు ఒక నెలలో వారిని దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం శుక్రవారం తెలిపింది. ఈ ఆర్డర్ 2022 అక్టోబర్ నుంచి అమెరికాకు వచ్చిన నాలుగు దేశాలకు చెందిన‌ దాదాపు 5,32,000 మందికి వర్తిస్తుంద‌ని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ తెలిపారు. ఏప్రిల్ 24తో వారి లీగ‌ల్ స్టేట‌స్ ర‌ద్ద‌వుతుంద‌ని వెల్ల‌డించారు. ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసు ప్రచురించబడిన 30 రోజుల తర్వాత వారు తమ చట్టపరమైన హోదాను కోల్పోతారని తెలిపారు. కాగా, యుద్ధం లేదా ఇత‌ర కార‌ణాల‌తో అనిశ్చితి నెల‌కొన్న దేశాల‌కు చెందిన పౌరుల‌కు ఈ హోదా ద్వారా అమెరికాలో తాత్కాలిక నివాసం క‌ల్పిస్తారు.  

 

ఇది కూడా చదవండి: కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చరిత్రలో తొలిసారి... అప్పుడు మూడు నెలల పాటు తిరుమల ఆలయాన్ని మూసివేయాలనుకున్న అధికారులు! ఏం జరిగింది? మరి ఇప్పుడు...

 

ఏపీలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం.. ఓకే చెప్పిన జైషా.. అక్కడే ఫిక్స్.!

 

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త వాతావరణం.. కార‌ణ‌మిదే!

 

దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గ‌ల కార‌ణాలు.!

 

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం! త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో..

 

రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!

 

చీప్‌.. వెరీ చీప్‌.. రూ. 599కే ఎయిర్‌ ఇండియా టికెట్‌.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!

 

USA: F-1 విద్యార్థి వీసా నుండి H-1B వర్క్ వీసాకు మారుతున్నారా? కఠినతరం చేసే ఇమ్మిగ్రేషన్ విధానాలు! మరిన్ని వివరాలు మీ కోసం!

 

జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Trump #Tariffs #IndiaModi #Modi #Trumpmeet