Header Banner

ఏపీలో రూ.96 వేల కోట్లతో భారీ పరిశ్రమ! కేంద్రం కీలక ప్రకటన!

  Wed Feb 05, 2025 08:27        Politics

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో తెలుగు దేశం పార్టీ ఎంపీ బీదమస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌ కీలక ప్రకటన చేశారు. ఏపీలోని నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)‌ రూ.96,862 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 6 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ రిఫైనరీ ద్వారా ఏటా 9-12 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేయొచ్చన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. పెట్టుబడి వ్యయంలో 75% మొత్తాన్ని ప్రోత్సాహకాల రూపంలో వచ్చే 25 ఏళ్లలో చెల్లిస్తుంది అన్నారు. అలాగే రీసెర్చ్, డెవలప్‌మెంట్ లెక్కల ప్రకారం 2022-23 ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి వాటాలో ఔషధ రంగం 33 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని.. 2016లో విశాఖపట్నంలో నైపర్‌ విద్యాసంస్థను కేంద్రం మంజూరు చేయలేదని కేంద్రమంత్రి చెప్పారు. 

 

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు సంబంధించి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు 2024 డిసెంబర్‌ 31 నాటికి రూ.38,965 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపారు. లోక్‌సభలో ఎంపీలు సీఎం రమేష్, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 'గతేడాది ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్యకాలంలో రూ.12,615.03 కోట్ల ఆదాయం రాగా.. రూ.3,943.43 కోట్ల నష్టం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నాటికి ప్లాంట్‌ 2.68 మిలియన్‌ టన్నుల హాట్‌ మెటల్, 2.37 మిలియన్‌ టన్నుల సేలబుల్‌ స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. సంస్థకు మూలధన వాటా కింద రూ.10,300 కోట్లు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

 

ఇంకా చదవండిజగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

2024 సెప్టెంబర్‌లో రూ.500 కోట్ల అత్యవసర నిధి కూడా అందించింది. రూ.1,140 కోట్ల వర్కింగ్‌ కేపిటల్‌ లోన్‌ను 7% నాన్‌క్యుమిలేటివ్‌ ప్రిఫరెన్స్‌ షేర్‌ కేపిటల్‌గా మారుస్తున్నాం. దీన్ని పదేళ్ల తర్వాత ఉపసంహరించుకోవచ్చు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ చాలా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌ నెలల్లో ఉద్యోగులకు వేతనాలు పాక్షికంగా చెల్లించింది. ఈ సమస్యలను అధిగమించి సంస్థ యథాతథంగా నడవడానికే కేంద్రం మూలధనం సమకూరుస్తోంది''అని తెలిపారు.

 

ఇండియా కొబ్బరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్నస్థనానికి చేరింది.. దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి ప్రశ్నకు సమాధానమిచ్చారు. 'ఆంధ్రప్రదేశ్‌లో 1.07 లక్షల హెక్టార్లలో 11.81 లక్షల టన్నులపరంగా దిగుమతి రానుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రైతులు కొబ్బరి దిగుబడిలో కొత్త రికార్డు స్థాపించారని, అందుకు వారిని అభినందిస్తున్నాను' అన్నారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనను ప్రతి పంటకూ విస్తరించాలని టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరోడైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలిఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP