Header Banner

పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!

  Sun Mar 02, 2025 15:14        Others

కళ్లు కూడా తెరవని పసి బిడ్దలను.. అమ్మ ఒడిలో వెచ్చగా నిద్రపోవల్సిన శిశువులను.. ఓ మహిళా ముఠా డబ్బుకు కక్కుర్తిపడి తల్లి ఒడి నుంచి వేరుచేసి లక్షలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాను తాజాగా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. గడచిన 9 నెలల్లో 26 మంది శిశువులను విక్రయించారు.


అప్పుడే పుట్టిన పసిబిడ్డను కొందరు దుండగులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పసిపిల్లలను తీసుకువచ్చి రాష్ట్రంలో సంతానం లేనివారికి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న మహిళల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. విక్రయిందుకు తీసుకువచ్చిన ముగ్గురు పిల్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మగపిల్లలు, ఒక పాపను తమ సంరక్షణలోకి తీసుకున్నట్లు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. వివరాల్లోకెళ్తే..

 

ఇది కూడా చదవండి: పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

విజయవాడలోని భవానీపురం కబేళా ప్రాంతానికి చెందిన బలగం సరోజిని (21) గతంలో సంతానంలేని దంపతులకు విజయలక్ష్మి అనే మహిళ ద్వారా ఎగ్స్‌ డొనేట్‌ చేసి కమిషన్‌ తీసుకునేది. ఈ క్రమంలో పలువురు యువతులతో కూడా ఎగ్‌ డొనేట్‌ చేయించి కమీషన్‌ తీసుకునేది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పిల్లలను విక్రయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపింది. దీంతో ఢిల్లీకి చెందిన ప్రీతి కిరణ్, అహ్మదాబాద్‌కు చెందిన అనిల్‌తో పరిచయం పెంచుకుంది. వారు పిల్లలను తీసుకువచ్చి సరోజినికి విక్రయించేవారు. ఆమె రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లాభం చూసుకుని ఇతరులకు విక్రయించేది. మగ బిడ్డనైతే రూ.5 లక్షలు, పాప రూ.3 లక్షలకు విక్రయించేది. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన పిల్లలను పాయకాపురం ప్రకాశ్‌నగర్‌లో ఉంటున్న తన బంధువులైన కొవ్వరపు కరుణశ్రీ (25), పెదాల శిరీష (26)ల వద్ద ఉంచేది. కొనుక్కున్న వారికి శిశువులను అప్పగించడానికి అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన షేక్‌ ఫరీనా (26), షేక్‌ సైదాబీ (33)లను నియమించుకుంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డెడ్‌లైన్.. పార్టీ నిర్మాణంపై కీలక ఆదేశాలు! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

ప్రకాశ్‌నగర్‌లో పసిపిల్లల విక్రయంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక సోదాలు చేశారు. సూత్రధారి సరోజినితో పాటు మరో నలుగురు యువతులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ముగ్గురు చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు శిశువులను ఈ ముఠా విక్రయించినట్లు తేలడంతో ఎవరికి విక్రయించారన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. గుంటూరు, నరసరావుపేట, ఏలూరుకు పోలీసు బృందాలు వెళ్లాయి. ప్రధాన నిందితులురాలు సరోజిని గత 9 నెలల్లో ఏకంగా 26 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో ఓసారి జైలుకు వెళ్లొచ్చినా తీరు మార్చుకోని సరోజినీపై పీడీ యాక్ట్‌ కింద కేసు పెట్టినట్లు సీపీ పేర్కొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కూటమిలో అంతర్యుద్ధం వచ్చిందని వైసీపీ మాజీ ఎంపీ! హోంమంత్రి అనిత రివర్స్ పంచ్!

 

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.! తేడా వస్తే భారీ జరిమానాలు..లిస్ట్ ఇదిగో!

 

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #InfantTrafficking #BabySellingRacket #CrimeAgainstChildren #HumanTrafficking #VijayawadaCrime #ChildProtection