Header Banner

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

  Fri Feb 07, 2025 22:07        Politics

వైఎస్ జగన్ కు మరో భారీ షాక్ తగలనుందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‍లో వైరల్‍గా మారింది. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో.. ఐదుగురు పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా రిజర్వుడ్ స్థానాల నుంచి గెలిచిన వారిని సమాచారం. ఎమ్మెల్యేగా గెలిచినా.. అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనలేని పరిస్థితి వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసి.. అసెంబ్లీకి వెళ్లాలని వారు ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే 2014, 2019 ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేలు పార్టీలు మారడం.. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను సైతం వారు పరిశీలించి ఆచీ తూచీ అడుగులు వేసేందుకు ఆ ఐదుగురు.. తమ తమ ప్రణాళికలు సిద్దం చేసుకున్నారని ప్రచారం సైతం సాగుతోంది.


ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!



అదీకాక వై నాట్175 ? అంటూ అధికారంలో ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తన పార్టీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే దక్కించుకొంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఈ హోదా కేటాయించాలంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. స్పీకర్ కు లేఖ రాశారు. కానీ సంఖ్య బలం లేదంటూ స్పీకర్ స్పష్టం చేయడంతో.. వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గత ఎన్నికల్లో ఓటమి పాలై ఇంట్లో ఉన్న వారికి గెలిచి అసెంబ్లీకి వెళ్లలేక ఇంట్లో ఉండే తమకు ఏ మాత్రం తేడా లేకుండా పోయిందంటూ వైసీపీలోని పలువురు ఎమ్మెల్యేలు కేడర్ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలంతా శాసన మండలికి వెళ్తున్నారు. కానీ మన పరిస్థితి ఏమిటని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొంటున్నట్లు సమాచారం.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



ఈ ఎన్నికల ముందే కాదు.. ఆ తర్వాత సైతం.. అంటే పార్టీ ఓటమితో పలువురు కీలక నేతలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు తమ రాజ్యసభ స్థానాలకే కాదు... పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఇక వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డి సైతం పార్టీకే కాదు.. రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. చాలా మందే వైసీపీని అధికారికంగా, అనధికారికంగా రాజీనామాలే కాదు.. దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీలో కేడర్ కు దిశా నిర్దేశం చేసే నాయకులే లేకుండా పోయారు. ఇటువంటి వేళ.. భవిష్యత్తులో రాజకీయాల్లో మనగలగాలంటే.. వైసీపీకి గుడ్ బై చెప్పడం ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే భావనలో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదీ ఏమైనా ఈ శివరాత్రి నాటికి వీరంత తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారనే చర్చ సైతం ఊపందుకొంది.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

 

విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్య‌లు వైర‌ల్‌!

 

జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?

 

జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..

 

ఈ ప్రాంత వాసులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్! కొత్త రైల్వే జోన్‌కు ఉత్తర్వులు జారీ.. ప్రధాన రైల్వే డివిజన్లు ఇవే.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #jagan #shockingnews #mla #rajinama #todaynews #flashnews #latestupdate