Header Banner

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో... ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

  Sat Apr 19, 2025 13:19        Politics

విజయవాడ రైల్వే స్టేషన్‌కి రూపురేఖలు త్వరలో మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.850 కోట్ల భారీ వ్యయంతో ఈ స్టేషన్‌ను విమానాశ్రయ స్థాయిలో అత్యాధునికంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకం ప్రకారం, స్టేషన్‌లో విశ్రాంతి గదులు, ఏసీ/నాన్-ఏసీ వేటింగ్ హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, పార్కింగ్ స్థలం, లైటింగ్ వ్యవస్థ, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే స్టేషన్‌కు సంబంధించి డీపీఆర్‌ను తయారు చేసి కేంద్ర రైల్వే బోర్డుకు పంపారు. ఆమోదం రాగానే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత బెజవాడ స్టేషన్ పూర్తిగా కొత్త లుక్‌లో మెరిసిపోనుంది.

 

విజయవాడ రైల్వే స్టేషన్‌ దక్షిణ మధ్య రైల్వేలో కీలక కేంద్రంగా ఉండి, ప్రతిరోజూ సుమారు లక్ష మంది ప్రయాణికులను సర్వీసు చేస్తోంది. పండగల సమయంలో ఈ సంఖ్య రెండు లక్షల వరకు చేరుతుంది. దాదాపు 250 ప్రయాణికుల రైళ్లు, 80 గూడ్సు రైళ్లు విజయవాడ మీదుగా నడుస్తున్నాయి. ఐదు ప్రవేశ ద్వారాలు కలిగిన అరుదైన స్టేషన్‌గా గుర్తింపు పొందిన విజయవాడ స్టేషన్‌ గతేడాది ఎన్‌ఎస్‌జీ 01 హోదాను కూడా అందుకుంది. రాబోయే కాలంలో అమరావతికి రాజధాని హోదా అమలవుతుందని భావించడంతో, ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో ముందస్తుగానే సదుపాయాలు పెంచుతూ, ఈ ప్రాంతంలోని రాయనపాడు, గుడివాడ, మచిలీపట్నం, గుణదల వంటి ఇతర స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తూ అమృత్ పథకం కింద వేగంగా పనులు కొనసాగుతున్నాయి.

 

ఇది కూడా చదవండిజగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapradesh #VijayawadaRailwayStation #AmritBharatStation #RailwayTransformation #StationRedevelopment #ModernRailwayStations #RailwayUpgrades