Header Banner

గుండె సమస్యలను దూరం చేసే చిన్న చిట్కా! వంటిట్లోని వన మూలికలతో ఇలా చెస్తే..

  Wed Feb 19, 2025 11:06        Health

బాడీలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అది ధమనుల్లో అడ్డంకిగా మారుతుంది. దీంతో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యని దూరం చేసేందుకు కొన్ని ఫుడ్స్ మనకి హెల్ప్ చేస్తాయి. అవేంటో తెలుసుకోండి.

కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీని వల్ల ఎన్నో సమస్యలొస్తాయి. కొలెస్ట్రాల్‌లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండు చెడు కొలెస్ట్రాల్. ఈ చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు, హైబీపి, స్ట్రోక్ వంటి సమస్యలొస్తాయి. నేటి కాలంలో సరైన లైఫ్‌స్టైల్ సరిగా లేని కారణంగా చాలా మందికి కొలెస్ట్రాల్ పెరిగి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. దీంతో ఈ కొలెస్ట్రాల్‌ని తగ్గించుకునే అవకాశం ఎంతైనా ఉంది. దీనికోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా మన డైట్‌లో యాడ్ చేయాలి. దీని వల్ల సమస్య చాలా వరకూ దూరమవుతుంది. మరి అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.

పసుపులో​ కర్కుమిన్ ఉంటుంది. ఇది బాడీలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ ఆక్సీకరణ తగ్గుతుంది. దీనిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల దీనిని తీసుకోవడం వల్ల శరీరంలోని మంటని తగ్గిస్తుంది. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుంది. పసుపుని నీటిలో కలిపి తాగితే రక్తం పలచగా మారుతుంది. దీనిని వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. బీపి బ్యాలెన్స్‌గా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచడంలో పసుపు చాలా హెల్ప్ చేస్తుంది. దీని వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అనేక సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

పసుపు, తేనె కలిపిన నీటిని తాగడం వల్ల బాడీలోని టాక్సిన్స్ దూరమవుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఓ టేబుల్ స్పూన్ పసుపులో ఓ టేబుల్ స్పూన్ తేనె కలిపి ఉదయాన్నే పరగడపున తాగండి. కొలెస్ట్రాల్, గుండె సమస్యలు దూరమవుతాయి. పసుపుని రెగ్యులర్‌గా తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి, ఎలా అయినా మీ డైట్‌లో పసుపుని యాడ్ చేసుకోండి.

పసుపు పాలు కూడా చాలా మంది తాగుతుంటారు. పసుపు పాలని రోజూ తాగడం వల్ల బాడీలో మంట తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలలో అరటీస్పూన్ పసుపు కలిపి తాగండి. దీంతో రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హాయిగా నిద్రపడుతుంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #Andhrapradesh #milk #health #Diet