Header Banner

ఆరోగ్యానికి సూపర్ బూస్ట్! చేదుగా ఉండే మెంతులలో మధురమైన ఆరోగ్య ప్రయోజనాలు!

  Sat Apr 19, 2025 07:25        Health

మెంతులు ప్రతి వంటింట్లో కనిపించే సాధారణమైన మసాలా పదార్థం అయినప్పటికీ, వాటిలో ఉన్న ఔషధ గుణాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మెంతులలో క్యాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఫోలిక్ యాసిడ్‌, రైబోఫ్లావిన్‌, కాపర్‌, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, జీర్ణక్రియను బాగుపరుస్తాయి. ముఖ్యంగా మెంతులను మొలకలుగా చేసి తీసుకుంటే వాటిలోని పోషక విలువలు రెట్టింపు అవుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మొలకలు వేసిన మెంతులు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండటంతో శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ ను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారం కలిగిస్తాయి.

రోజూ ఉదయం పరగడుపున మెంతి మొలకలు తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గించడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో మెంతి మొలకలు సహాయపడతాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను నివారించడంలోనూ సహాయపడతాయి. ఈ విధంగా చిన్న మెంతి గింజలు పెద్ద ఆరోగ్య రహస్యాన్ని దాచివున్నాయనీ చెప్పవచ్చు

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #menthulu #fenugreekbenefits #healthtips #ayurvedamtips #naturalremedies #diabetescare #weightlossfoods