Header Banner

కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు చాంబర్‌లో పవన్ కల్యాణ్ తో ప్రత్యేక భేటీ! పలు కీలక నిర్ణయాలకు ఆమోదం!

  Tue Mar 18, 2025 09:30        Politics

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది.. అయితే, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు ఛాంబర్ కి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుండగా.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకునే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.. మరోవైపు ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ టూర్లో ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న ఆయన.. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రధానిని ఆహ్వానించడంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఏపీ కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునివర్సిటీస్ యాక్ట్- 2016 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ నంబూరు, పెద్ద కాకానికి బ్రౌన్ ఫీల్డ్ క్యాటగిరి కింద అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది..


ఇది కూడా చదవండివైసీపీకి మరో భారీ షాక్! కీలక నేత అరెస్ట్.. అసలు ఏమైందంటే..?


ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ ట్రాన్స్ఫర్స్, రెగ్యులేషన్ యాక్డ్- 2025 డ్రాఫ్ట్ బిల్లును అప్రూవ్ చేసింది.. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ మున్సిపల్ స్కూళ్లకు ఇది వర్తింప జేయనున్నారు.. ఇక, సీఆర్డీఏ పరిధిలో మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు భూములు కేటాయింపునకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో ఎన్- 10 నుంచి ఎన్ 13 వరకు E1 జంక్షన్ నుండి సీఆర్డీఏ సరిహద్దుల వరకు 1082 కోట్ల రూపాయలతో 400KV DC లైన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు.. బుడమేరు డివిజన్ కు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ యంత్రాల రిపేర్లకు పరిపాలన అనుమతి జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఏపీలో స్టార్ట్ అప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ 4.0కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. ప్రభుత్వ హామీ మేరకు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే..


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్! ఆధార్ ఫింగర్ సమస్యకు పరిష్కారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!


తిరుమలలో భక్తుల వసతి కష్టాలకు చెక్! శిథిల భవనాల తొలగింపు.. టీటీడీ కార్యాచరణతో కీలక మార్పులు!


మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!

 

నేటితో గొడ్డలి వేటుకు ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!

 

 రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!

 

 గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగం... అసలు నిజాలు బయటకు!

 

ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ !

 

బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APCM #CBN #cabinet #beti #todaynews #flashnews #latestnews