Header Banner

ఇదో కొత్త రకం బ్రేకప్.. తమన్నా – విజయ్ వర్మ రెండేళ్ల ప్రేమకు బ్రేకప్! అభిమానులకు షాకింగ్ న్యూస్!

  Wed Mar 05, 2025 18:16        Entertainment

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ హీరో విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారనేది బహిరంగ రహస్యమే.. 2023 నుంచి కొనసాగుతున్న తమ ప్రేమ బంధాన్ని ఆ జంట పలు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. నిన్న మొన్నటి వరకూ ఫంక్షన్లలో జంటగా కనిపించారు. రేపోమాపో పెళ్లి వార్త చెబుతారని ఆశించిన అభిమానులకు వారి సన్నిహితులు తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పారు. తమన్నా, విజయ్ విడిపోయారని, కొన్ని రోజులుగా విడిగా ఉంటున్నారని పేర్కొంటున్నారు. కారణం ఏమిటనేది తెలియరాలేదు కానీ, వారిద్దరూ విడిపోయారనేది మాత్రం నిజమేనంటూ పలు మీడియా సంస్థలలో వార్తలు వెలువడ్డాయి. ప్రేమికులుగా విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతామని తమన్నా, విజయ్ చెబుతున్నారట. వృత్తిపరంగా ఒకరినొకరు గౌరవించుకుంటారని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ లవ్ బ్రేకప్ వార్తలపై ఇటు తమన్నా కానీ అటు విజయ్ కానీ స్పందించలేదు. ఇప్పటికే వారాలు గడిచినా తమ బ్రేకప్ విషయంపై వారు ఎక్కడా మాట్లాడలేదు. కాగా, నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సందర్భంగా తమన్నా, విజయ్ ల మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకూ వారు డేటింగ్ లో ఉన్నారని సమాచారం. ఈ ఏడాది తమన్నా, విజయ్ పెళ్లిపీటలు ఎక్కనున్నారని ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా వారిద్దరూ ఇప్పుడు విడిపోయారని, బ్రేకప్ చెప్పుకున్నారని సమాచారం.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tamannaah #Tollywood #Bollywood #FansShockingNews #Vijayvarma #Lovebreakup #MilkyBeauty