Header Banner

కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర! వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో..

  Thu Feb 06, 2025 15:12        Politics

ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీల పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఎంఎస్ఎంఈ, ఎంఈడీపీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ పాలసీల్లో పలు సవరణలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలకు చేయూత అందించేలా పాలసీల్లో సవరణలకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో ప్రత్యేక రాయితీలు, అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.

 

ఇది కూడా చదవండి: USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

 

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన దాదాపు రూ.45వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తెదేపా అధికారంలో ఉండగా చేపట్టిన నీరు-చెట్టు పనులకు సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్న బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్లకు కొత్త టెండర్లు పిలిచే అంశంపై చర్చ జరిగింది. తితిదేలో పోటు కార్మికులకు సంబంధించిన 15 పోస్టులను సూపర్వైజర్ స్థాయికి పెంచేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లా తమ్మినపట్నం, కొత్తపట్నంలో చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి పరిహారం కింద ఎకరాకు రూ.8లక్షలు చొప్పున దాదాపు రూ.79కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. మద్యం ధరలపై క్యాబినెట్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్య‌లు వైర‌ల్‌!

 

జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?

 

జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..

 

ఈ ప్రాంత వాసులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్! కొత్త రైల్వే జోన్‌కు ఉత్తర్వులు జారీ.. ప్రధాన రైల్వే డివిజన్లు ఇవే..

 

నేడు (6/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేశ్ భేటీ! ఈ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #andhrapradesh #apcabinet #meeting #APPolitics #Chandrababu