Header Banner

ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్! డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరి రూ. 1 లక్షా 60 వేలు..

  Thu Feb 06, 2025 15:44        Politics

మహిళల కోసం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. డ్వాక్రా మహిళలకు ముఖ్యమైన అవకాశం అందించడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్), నాబార్డు, కేతీ సంస్థలు కలిసి ఓ ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నాయి. 50% సబ్సిడీతో షేడ్ నెట్స్ అందించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారింది. దీంతో ఏపీలోని మహిళలకు భారీగా లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలో ఉద్యాన సాగును ప్రోత్సహించేందుకు ఈ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5,000 మంది లబ్ధిదారులకు షేడ్ నెట్స్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మొదటి విడతగా ఈ మార్చి నాటికి 310 మందికి షేడ్ నెట్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్థారించింది. ఈ షేడ్ నెట్స్ ఒక్కో దాని విలువ రూ.3.22 లక్షలు ఉంటుంది. అర్హులైన లబ్ధిదారులకు 50% రాయితీ అందించనున్నారు. మిగిలిన మొత్తం స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ ద్వారా రుణంగా అందించనున్నారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఏడాది మార్చి నాటికి 260 మందికి షేడ్ నెట్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి జాతీయ జీవనోపాధి పథకం కింద భారీగా నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర! వారికి విద్యుత్ సహా పలు విభాగాల్లో..

 

ఇప్పటి వరకు రూ.550 కోట్ల నిధులు మాత్రమే లభించగా, దాన్ని రూ.1,000 కోట్లకు పెంచుతామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఈ పథకానికి రాష్ట్రవాటా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రక్షిత వ్యవసాయం (షేడ్ నెట్ వ్యవసాయం)కు ఆదరణ పెరుగుతోంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి, అధిక ఆదాయాన్ని అందించేందుకు ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీలను రైతులు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. షేడ్ నెట్ వ్యవసాయంలో వచ్చే లాభాలు ఏంటంటే? ఉష్ణోగ్రత నియంత్రణ: మండుటెండల్లోనూ పంట రక్షణ, అధిక దిగుబడి: తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట ఉత్పత్తి, ఎకరాకు అధిక ఆదాయం: నాలుగు ఎకరాల్లో లభించే దిగుబడిని ఒకే ఎకరాలో పొందే అవకాశం, పంట సంరక్షణ: కూరగాయల సాగుకు అనువైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ షేడ్ నెట్ వ్యవసాయం ద్వారా మహిళా రైతులకు నూతన ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, వారి ఆర్థిక స్థితిలో గణనీయమైన మార్పు రావడం ఖాయం..

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

USA: సంకెళ్లతో భారత వలసదారులు.. దారివెంట మృతదేహాలు.. వెలుగులోకి భారత వలసదారుల దీనగాథలు!

 

విలన్ గా మారుతున్న బ్రహ్మానందం.. థియేటర్ అంతా షేక్ అవుద్ది అంటూ.. వ్యాఖ్య‌లు వైర‌ల్‌!

 

జగన్ దొంగ రాజకీయం.. ఆ డబ్బును లెక్కపెట్టడానికి.. వింటే దిమ్మ తిరిగిపోయే మ్యాటర్ ఇది!

 

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు! ఎక్కడో తెలుసా?

 

జగన్ 2.0 కాదు, పాయింట్ 5 మాత్రమే! మాజీ మంత్రి తీవ్ర విమర్శలు! ఇలాంటి పరిస్థితుల్లో..

 

ఈ ప్రాంత వాసులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్! కొత్త రైల్వే జోన్‌కు ఉత్తర్వులు జారీ.. ప్రధాన రైల్వే డివిజన్లు ఇవే..

 

నేడు (6/2) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో లోకేశ్ భేటీ! ఈ పథకం కింద రూ. 5,684 కోట్లు మంజూరు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews