Header Banner

ఆయన రాజేసిన చిచ్చును ఆర్పుతున్న చంద్రబాబు! ఆ చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదు!

  Tue Feb 11, 2025 14:35        Politics

గిరిజన హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామ‌ని తెలిపారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందిస్తున్నామని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు గుర్తు చేశారు. అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామ‌న్నారు.

 

ఇది కూడా చదవండి: ఆ బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. చంద్రబాబు కీలక హామీ!

 

ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నెం.3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామ‌ని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దు అయిందని ఆయన అన్నారు. దాని పునరుద్ధరణకు తాము కృషి చేస్తామ‌ని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం త‌మ ప్ర‌భుత్వానికి ఏమాత్రం లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. అలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని గిరిజనులను కోరారు. సమాజంలో అట్టడుగున ఉన్న గిరిజ‌నుల‌ అభివృద్ధికి సదా కట్టుబడి ఉన్నామని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ మేర‌కు సీఎం చంద్ర‌బాబు త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో రెండు చోట్ల వైరస్‌ నిర్ధారణ! రెడ్ జోన్ ఏర్పాటు - పీపీఈ కిట్లతో కోళ్ల తనిఖీలు.!

 

BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. మ‌రో స‌రికొత్త డేటా ప్లాన్‌! ప్ర‌తిరోజు 2జీబీ డేటా ఫ్రీ.!

 

జగన్ ఎంతకైనా తెగిస్తారు.. మంత్రులు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన చంద్రబాబు!

 

ఉదయభాను కూతుళ్లకు మర్చిపోలేని గిఫ్ట్ పంపించిన నారా బ్రాహ్మణి.. అది ఏంటంటే?

 

అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం.. తాత్కాలికంగా ఎయిర్ పోర్ట్ ను మూసేసిన అధికారులు!

 

టాలీవుడ్ లో హల్ చల్.. ప్లీజ్ ఇక వదిలేయండి.. రామ్ చరణ్ ను నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ అనలేదు!

 

జగన్ కి షాక్.. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!

 

షాకింగ్ న్యూస్.. ట్రంప్ బాటలో UK ప్రధాని.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం! 600 మందికి పైగా.. భారతీయ విద్యార్థులకు నిరాశ తప్పదా?

 

అసలు వీడు మనిషేనా.. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరకు పంపు.. ఆ జిల్లాలో కామ కీచకుడు!

 

విద్యార్థులకు తీపి కబురు అందించిన సీఎం! వారందరికీ ఉపకార వేతనాలు! ఒక్కొక్కరికి ఎంత అంటే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #TribalRights