Header Banner

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

  Fri Mar 07, 2025 12:14        Politics

ఓవైపు ఖజానాలో డబ్బు లేదంటూనే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం అప్పుడప్పుడూ ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటోంది. తద్వారా చేతల్లో సంక్షేమ పాలనను చూపిస్తోంది. తాజాగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి.. ఆ సందర్భంగా.. ఏపీలోని ప్రధాన నగరాల్లో డ్వాక్రా మహిళలకు ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవ్వబోతోంది. ఇందుకోసం జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. సీఎం చంద్రబాబు ప్రతి నెలా పెన్షన్ ఇవ్వడానికి లబ్దిదారుల ఇళ్లకు వెళ్తున్నారు కదా. అదే విధంగా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు.. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంకి వెళ్లబోతున్నారు. అక్కడో పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. అక్కడో సభ కూడా పెడుతోంది. ఆ సభలో సీఎం చంద్రబాబు స్వయంగా.. మహిళా రైడర్లకు 10 బైక్‌లు, 10 ఆటోలు ఇస్తారు. చంద్రబాబు లాగానే.. వివిధ జిల్లాల్లోని 8 నగరాల్లో 1,000 వాహనాలను రైడర్లకు ఇస్తారు. వీటిని ఈ మహిళలు నడుపుతారు. అంటే టాక్సీ సర్వీసుల లాగా నడుపుతారు. తద్వారా మహిళలకు రోజూ ఆదాయం వస్తుంది. ఇలా వీరు నడపాలంటే.. ఏదైనా సంస్థ ఉండాలి కదా. అందుకోసం ప్రభుత్వం ర్యాపిడోతో డీల్ కుదుర్చుకుంది. అంటే.. ఈ 1000 ఆటో, ఎలక్ట్రిక్ బైక్ మహిళా రైడర్లు.. ర్యాపిడో తరపున సర్వీసులు అందిస్తారు. ఎవరైనా ర్యాపిడో ఆటో లేదా ఈ-బైక్ బుక్ చేసుకుంటే..

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

ఈ మహిళా రైడర్లు.. డ్రైవ్ చేస్తూ.. గమ్యస్థానాలకు తీసుకెళ్తారు. ఇలా వీరు ఆదాయం పొందుతారు. ఈ ప్లాన్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం విజయవాడలో 400, విశాఖపట్నంలో 400 బైక్‌లు, ఆటోలు ఇస్తుంది. అలాగే.. గుంటూరులో 50, నెల్లూరులో 50 ఇస్తుంది. మిగతా 100 వాహనాలను.. తిరుపతిలో 25, కర్నూలులో 25, కాకినాడలో 25, రాజమహేంద్రవరంలో 25 ఇస్తుంది. ఇది ట్రయల్ మాత్రమే. ఇది సక్సెస్ అయితే.. భవిష్యత్తులో మరింత మందికి ప్రభుత్వం ఇలా ఇవ్వాలి అనుకుంటోంది. దీని వల్ల ప్రస్తుతం 1000 కుటుంబాలకు ఆదాయం వస్తుంది. వారు కొత్త జీవనోపాధిని పొందినట్లు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా.. కనీసం ఇలా ప్రైవేట్ ఉపాధి అవకాశాలైనా లభిస్తే.. నిరుద్యోగ యువతకు ఒకింత ఉపశమనంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం అవుతోంది. ఇక ట్రావెల్ సర్వీసుల్లో ర్యాపిడో ఓ సెన్సేషన్ అనుకోవచ్చు. ఈ సంస్థ టూవీలర్ సర్వీసులు తేవడంతో.. అప్పటివరకూ క్యాబ్ సర్వీసులు మాత్రమే ఇలా అందుబాటులో ఉండేవి. ర్యాపీడో రాకతో.. ట్రావెల్ ఖర్చు బాగా తగ్గింది. దాంతో హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ప్రజలు ర్యాపిడోపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ర్యాపిడో మరింత విస్తరించేందుకు ఛాన్స్ వచ్చినట్లే. ఇది ఆ సంస్థ ఏపీలో తన కస్టమర్లను భారీగా పెంచుకోవడానికి వీలవుతుంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

 

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations