Header Banner

ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

  Sun Feb 09, 2025 21:40        Politics

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూముల ప్రక్షాళన మొదలుపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు భూములు ఇస్తున్నట్లు చెబుతూ అక్రమార్కులకు కట్టబెట్టిందనీ, అలాగే చాలా ల్యాండ్ కబ్జాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించిన ప్రభుత్వం.. మొత్తం భూముల క్రమబద్ధీకరణకు తెర తీసింది. ఇప్పుడు ఎవరైనా భూముల్ని క్రమబద్ధీకరించుకోవాలి అనుకుంటే.. వెంటనే వెళ్లి ఆ పని పూర్తి చేయించుకోవచ్చు. భూముల క్రమబద్ధీకరణ కోసం అధికారుల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అసరం లేదు. సింపుల్‌హా, మీసేవ కేంద్రాలకు వెళ్లొచ్చు. లేదా.. గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయానికి వెళ్లొచ్చు. అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు సంబంధించి.. భూముల పత్రాలు తీసుకెళ్లాలి. అలాగే ఆధార్ లాంటి గుర్తింపు కార్డులు కూడా తీసుకెళ్లాలి. ప్రభుత్వం ఇప్పుడు జీఓ నంబర్ 30ని లెక్కలోకి తీసుకుంటోంది.

 

ఇది కూడా చదవండి: తప్పు చేస్తే ఎవరికీ ఉపేక్ష లేదు.. జనసేన నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్! కిరణ్ రాయల్‌పై విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం!

 

దీని ప్రకారం.. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025ని అమలు చేస్తున్నారు. దరఖాస్తులను డిసెంబర్ 31 వరకూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తీసుకుంటారు. ఇక్కడో ట్విస్ట్ ఉంది. క్రమబద్ధీకరించిన తర్వాత ఇచ్చే పట్టాలను మహిళల పేరు మీదే ఇస్తారు. క్రమబద్ధీకరించుకునే వారు.. పట్టా, కన్వేయర్ డీడ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని తీసుకునే అధికారులు.. 2 సంవత్సరాల తర్వాత.. యాజమాన్య హక్కులను జారీ చేస్తారు. అందువల్ల మీసేవ ద్వారా అప్లై చేసుకోవాలి అనుకునేవారు.. తమ పూర్తి వివరాల్ని మీసేవ సిబ్బందికి ఇవ్వాలి. అలాగే వారు చెప్పిన పత్రాలను ఇస్తే, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. భూముల క్రమబద్ధీకరణలో గందరగోళం రాకుండా ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసింది. ముందుగానే అత్యంత కచ్చితత్వంతో ఉండే దరఖాస్తు విధానాన్ని మీసేవలోకి తెచ్చింది. ఇందులో 150 గజాల వరకూ.. ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తారు. ఇందుకు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

 

ఇది కూడా చదవండి: జగన్ కి షాకులు మీద షాకులు.. గుంటూరు మేయర్ పీఠంపై! మొత్తం 56 మంది కార్పొరేటర్లు!

 

ఆ పైన భూమి ఉన్నవారికి స్వల్ప ఫీజు తీసుకుంటున్నారు. ఎవరైనా నిర్లక్ష్యం చేసి.. క్రమబద్ధీకరణ చేయించుకోకపోతే.. అక్రమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ముందుగా.. కాలువలు, నదీ ప్రవాహ గట్లు, లే అవుట్ స్థలాలు, జోనల్ ప్లాన్, మాస్టర్ ప్లాన్, జలవనరులకు సంబంధించిన స్థాలాలు, నిర్దేశిత స్థలాల్లో క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఈ భూముల్లో అక్రమమైన వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది ఆల్రెడీ క్రమబద్ధీకరణకు ఇదివరకే అప్లికేషన్ పెట్టుకొని ఉండొచ్చు. వారు ఇప్పుడు మళ్లీ పెట్టాల్సిన పనిలేదు. పాత దరఖాస్తులను కూడా ప్రభుత్వం ఇప్పుడు పరిశీలించబోతోంది. త్వరలో ఏపీ వ్యాప్తంగా పరిశీలనలు ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిసి.. ఎమ్మార్వోలు ఈ పనిని చేయిస్తారు. మొత్తం క్రమబద్ధీకరణ పూర్తయ్యాక.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హత కలిగిన భూముల వివరాలు, వాటి యజమానుల వివరాల్ని ప్రదర్శిస్తారు. ఆ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, 30 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఇదీ పరిస్థితి. మనకు ఎన్నో పనులు ఉన్నా.. ఈ భూముల క్రమబద్ధీకరణ మాత్రం ఎలాగొలా చేయించేసుకోవాలి. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. డిసెంబర్ 31 అంటే.. కొంత టైమ్ ఇచ్చినట్లే. సరిచేసేసుకుంటే.. నిజమైన సొంత భూములు కోల్పోకుండా జాగ్రత్త పడొచ్చు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటన, ఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!

 

జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..

 

ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు! ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews