Header Banner

కులమే శాపమైంది.. జగన్, విడదల రజినీ మోసం చేశారు.. వైసీపీ నేత సంచలన ఆరోపణలు.!

  Fri Mar 21, 2025 16:46        Politics

మాజీ మంత్రి, వైసీపీ(YCP) సీనియర్ నేత విడదల రజినీ(Vidadala Rajini)పై మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ (YSRCP MLC Marri Rajasekhar) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో గుర్తింపు లేదు.. తనను చులకనగా చూశారని ధ్వజమెత్తారు. ఇవాళ(శుక్రవారం) మర్రి రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ నుంచి బయటకు వెళ్లి పోవడానికి కారణం జగన్(Jagan) అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తనకు సరైన గుర్తింపు లేదని చాలా చులకన భావంతో చూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన కులమే తనకు శాపం అయిందని మర్రి రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని ఆయన చివరకు 2023 చివరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మమ అనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు సూచనలు.. అక్కడ అన్ని విమానాలు రద్దు చేసిన ఎయిరిండియా! కొన్ని విమానాల దారి మళ్లింపు..

 

ఓటమిపాలైన విడదల రజిని(Vidadala Rajini)కి చిలకలూరిపేట ఇన్చార్జిగా పట్టం కట్టారని ఆమెను బలోపేతం చేయడానికి తనను అవమానాలకు గురి చేశారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు. అంతేకాదు ఎంపీ కృష్ణదేవరాయలు వైసీపీలో ఉన్న సమయంలో తనపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేయించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తను సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా మర్రి రాజశేఖర్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే నలుగురు వైసిపి ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయ మంగళ వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేశారు. జగన్ తనను మోసం చేయడం వలనే తాను టిడిపిలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. ఆయన మాట తప్పారని, కానీ తాను పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేశానని ఆయన పేర్కొన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఆయన పద్ధతి నచ్చకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: షాక్ షాక్.. నా రాజీనామా కి కారణం ఆమెనే.. ఇదే ఫైనల్ అన్న రాజశేఖర్! ఈయన బాటలో మరికొందరు ఎమ్మెల్సీలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దారుణం.. విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి! ఆసిఫ్ మృతికి గ‌ల కార‌ణాలు.!

 

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సీఎం! త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో..

 

రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు! వీరప్పన్ కూతురికి ఆ పదవి ఫిక్స్!

 

చీప్‌.. వెరీ చీప్‌.. రూ. 599కే ఎయిర్‌ ఇండియా టికెట్‌.! ఈ బంపర్ ఆఫర్ మిస్సవ్వకండి.!

 

USA: F-1 విద్యార్థి వీసా నుండి H-1B వర్క్ వీసాకు మారుతున్నారా? కఠినతరం చేసే ఇమ్మిగ్రేషన్ విధానాలు! మరిన్ని వివరాలు మీ కోసం!

 

జగన్ పరిస్థితి అయోమయం.. సీఐడీ కస్టడీకి మాజీ ఎమ్మెల్యే.. ఆదేశాలు జారీ చేసిన కోర్టు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #YSRCP #Dastagiri #Pulivendula #Nomination