Header Banner

జగన్ కి షాకులు మీద షాకులు.. గుంటూరు మేయర్ పీఠంపై! మొత్తం 56 మంది కార్పొరేటర్లు!

  Sun Feb 09, 2025 16:02        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్థానిక సంస్థలు నడిపే పరిస్ధితి లేకపోవడంతో ఆయా చోట్ల వైఎస్సార్‌సీపీ కి షాకులు తప్పడం లేదు. తాజాగా గుంటూరు మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ఖరారు చేశారు. కార్పోరేటర్ల సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ మేరకు ఖరారు చేశారు. దీనికి కూటమి కార్పోరేటర్‌లు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గల్లా మాదవి, నసీర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం కార్పోరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా కోవెలమూడి ఉన్నారు. మార్చి 17తో మేయర్ పదవి కాలం నాలుగేళ్లు పూర్తి అవుతుంది.

 

ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు!

 

మార్చి 18 న ప్రస్తుత మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్దమవుతోంది. గతంలో అధికారంలో ఉండగా ఏకపక్షంగా స్థానిక సంస్థల్ని గెల్చుకున్న వైఎస్సార్‌సీపీకి ఇప్పుడు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు వరుస షాకులిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గుంటూరు నగర పాలక సంస్ధలోనూ ఇదే పరిస్ధితి ఎదురైంది. గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యానికి తాజాగా గండి పడింది. మొత్తం 56 మంది కార్పొరేటర్లు ఉన్న కౌన్సిల్లో 34 మంది టీడీపీ నేతృత్వంలోని కూటమికి మద్దతు పలికారు. దీంతో మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు ఆధ్వర్యంలోని వైసీపీ కౌన్సిల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. తాజాగా జరిగిన స్టాండింగ్ కౌన్సిళ్ల ఎన్నికల్లో ఆరుగురు సభ్యుల్ని గెలిపించుకోవడంలో సక్సెస్ అయిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం! ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటన, ఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి!

 

జైల్లోకెళ్లి దస్తగిరికి బెదిరింపులు - విచారణకు ఆదేశించిన ప్రభుత్వం! జగన్ గెట్ రెడీ..

 

ఉగాది నుంచి ఏపీలో పీ4 విధానం అమలు! ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #Chandrababuyagam #Familyfunction #AndhraPradesh #APNews