Header Banner

జడ్జీలపైనా అనుచిత వ్యాఖ్యలు.. అమరావతి పై అక్కసు వెళ్లగక్కినప్పుడే..

  Wed Jun 11, 2025 13:15        Politics

అమరావతి అంటే అక్కసు.. చంద్రబాబు అంటే ద్వేషం వెళ్లగక్కే క్రమంలో న్యాయస్థానాలను విమర్శించేందుకు సైతం సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, పాత్రికేయుడు కృష్ణంరాజు వెనకాడలేదు. న్యాయమూర్తుల వ్యవహారశైలి పైనే అనుమానాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 6న నిర్వహించిన కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతిపై వ్యాఖ్యలకు కొద్ది క్షణాల ముందు.. న్యాయస్థానాల పనితీరుపై కొమ్మినేని చర్చ ప్రారంభించారు. గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగితే హైకోర్టు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 'రాజకీయ వ్యవస్థలను బట్టి కోర్టులు కొన్ని సందర్భాల్లో నడుస్తుంటాయా? కృష్ణంరాజుకు ఈ విషయాలపై మంచి అవగాహన ఉంది.. ఆయన మాట్లాడతారు' అని చెప్పారు. 'న్యాయస్థానాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరున తీర్పులిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు వెంటనే స్పందించడం, కొన్ని సందర్భాల్లో అసలు తమకేమీ పట్టదన్నట్లు, తమకు సంబంధం ఏంటన్నట్లు వ్యవహరించడం కనిపిస్తోంది' అంటూ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

 

ఇది కూడా చదవండి: సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

'ఈమధ్యన ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన, ఇంకా విధుల్లో చేరని న్యాయమూర్తి.. 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీ రాష్ట్ర రాజధాని ఏదని.. ఎక్కడో చదువుతున్న తన కుమార్తెను గేలి చేస్తున్నారని చెప్పారు. ఆయన ఇప్పుడు మళ్లీ ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నారు.. ఇప్పటికీ ఏపీకి రాజధాని లేదు. ఆయన ఏం చేస్తారు?' అని ప్రశ్నించారు. 'న్యాయస్థానాలకు ఇష్టమైతే.. పత్రికలో చిన్న వార్త వస్తే దానిపై స్పందించి విచారణకు ఆదేశిస్తారు. లేదంటే తాటికాయంత అక్షరాలతో వార్తలొచ్చినా స్పందించరు' అని నోరుపారేసుకున్నారు. 'ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు.. కృష్ణానది ఒడ్డునే ఉన్న దీవిలో విందు ఇస్తే సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఎందుకు హాజరయ్యారు? ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలిసి అమరావతి ప్లాన్పై వివరించారు.. ఆయనతో ఒక్కరే ఏకాంతంగా కూర్చోవాల్సిన అవసరం ఏమిటి?' అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

 

12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..

 

ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #Appolitics #APNews #Inappropriate #Comments #Judges #Kommineni #Krishnam Raju #Amaravati #Comments On Judges