Header Banner

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఆ జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

  Tue Apr 22, 2025 07:00        Politics

హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65ను ఆరు వరసలుగా విస్తరించటానికి డీపీఆర్‌ రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో.. గొల్లపూడిలో విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ అనుసంధానం అయ్యేచోట క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రింగ్‌ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని ఎన్‌హెచ్‌ అధికారులు ఇంతకుముందే నిర్ణయించారు. ఈ రింగ్‌ను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై కన్సల్టెంట్‌ను కూడా నియమించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌-విజయవాడ 6 వరసల విస్తరణకు సంబంధించి డీపీఆర్‌ రూపకల్పన జరుగుతుండటంతో క్లోవర్‌ లీఫ్‌ ప్రతిపాదన ముందుకొచ్చింది. విజయవాడ పశ్చిమ బైపాస్‌ రోడ్డు.. చిన్న అవుటపల్లి దగ్గర ఎన్‌హెచ్‌-16 నుంచి మర్లపాలెం, గన్నవరం, కొండపావులూరు, నున్న, జక్కంపూడి, గొల్లపూడి అవుటర్‌ ప్రాంతాలను కలుపుతూ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెం మీదుగా కాజ చేరుకుని అక్కడ ఎన్‌హెచ్‌-16కు అనుసంధానమవుతుంది.

 

ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

ఇది గొల్లపూడి దగ్గర ఎన్‌హెచ్‌-65ను క్రాస్‌ చేస్తుంది. ఇక్కడ ఎన్‌హెచ్‌-65పై ఆర్‌వోబీ వెళ్తుంది. ఇక్కడ గతంలో జరిగిన తప్పిదం కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. విశాఖపట్నం, ఏలూరు నుంచి చిన అవుటపల్లి దగ్గర వెస్ట్‌ బైపాస్‌ మీదుగా వచ్చే వాహనాలు హైదరాబాద్‌ వెళ్లాలంటే ఆర్‌వోబీ పక్క నుంచి కిందకు దిగి.. గొల్లపూడి వెళ్లి అక్కడ ట్రాఫిక్‌ జంక్షన్‌ దగ్గర టర్నింగ్‌ తీసుకుని ఎన్‌హెచ్‌-65 మీదుగా ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంటుంది. చెన్నై నుంచి కాజ, విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ మీదుగా వచ్చే వాహనాలన్నీ విజయవాడ వెళ్లాలంటే గొల్లపూడి ఆర్‌వోబీ పక్క నుంచి దిగి ఇబ్రహీంపట్నం రింగ్‌కు వెళ్లి ఎన్‌హెచ్‌-65 మీదుగా వెనక్కి రావాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొద్దికాలం కిందట ఎన్‌హెచ్‌ అధికారులు గొల్లపూడి జంక్షన్‌ వద్ద ఒక రింగ్‌ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ రింగ్‌ జంక్షన్‌ కోసం కన్సల్టెంట్‌తో సర్వే చేయించారు. దీనివల్ల గొల్లపూడి దగ్గర బైపాస్‌ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు కానీ, దిగువన ఉన్న ఎన్‌హెచ్‌-65పై రాకపోకలు సాగించే వాహనాలు బైపాస్‌ ఎక్కాలన్నా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాహనాలు కూడా ఇటు గొల్లపూడి సెంటర్‌, అటు ఇబ్రహీంపట్నం వెళ్లకుండానే రింగ్‌ జంక్షన్‌ మీదుగా అక్కడిక క్కడే ఎటు కావాలన్నా వెళ్లే వీలుంటుంది.

 

ఇది కూడా చదవండి: పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

ఈ రింగ్‌ జంక్షన్‌కు పెద్దగా భూ సేకరణ కూడా అవసరం లేదని ఎన్‌హెచ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ రింగ్‌ జంక్షన్‌ పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదనేది నిపుణుల మాట. కనీసం సగం క్లోపర్‌ లీఫ్‌ జంక్షన్‌ అయినా ఏర్పాటు చేయాల్సిందేనని వారు ప్రతిపాదిస్తున్నారు. అయితే, దీనికి కూడా భూసేకరణ తప్పదని ఎన్‌హెచ్‌ వర్గాలు భావించి ఆ ప్రతిపాదనను విరమించుకున్నాయి. కాగా, అనూహ్యంగా సగం క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ ప్రతిపాదన పక్కకుపోయి పూర్తిస్థాయి క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ను ఏర్పాటుచేసే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా హైదరాబాద్‌-విజయవాడ వరకు ఎన్‌హెచ్‌- 65ను ఆరు వరసలుగా విస్తరించాలని నిర్ణయించటమే కారణం. డీపీఆర్‌ రూపకల్పన ప్రక్రియ కూడా వేగంగా శ్రీకారం చుట్టడంతో క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ అంశంపై ఎన్‌హెచ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రెండు భారీ జాతీయ రహదారులు అనుసంధానమయ్యేచోట, అందునా ఆరు వరసలుగా క్రాస్‌ అవుతున్న దగ్గర కచ్చితంగా క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ను అభివృద్ధి చేయకపోతే ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజధానికి సమీపంలో ఇలాంటి ట్రాఫిక్‌ తలనొప్పులు మంచిది కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో 6 వరసల విస్తరణ డీపీఆర్‌లో క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ను ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది. ఈ జంక్షన్‌ ఏర్పాటు చేయాల్సి వస్తే భూ సేకరణ తప్పదు. గొల్లపూడిలో అత్యంత ఖరీదైన భూములను సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా భూముల ధరలు మరింత పెరుగుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Vijayawada #New6HighWayLines #AndhraPradesh #APpolitics #CloverLeaf #Gollapudi