Header Banner

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

  Wed Feb 19, 2025 18:56        Politics

తాజాగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి గుంటూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జగన్ మిర్చి యార్డుకు వెళ్లి న్యూసెన్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. వైసీపీకి చెందిన దళిత నాయకులు జైలులో ఉంటే జగన్ వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. ఇక గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులపై ప్రేమ ఉన్నట్టు జగన్ మాట్లాడుతున్నాడని, గత ప్రభుత్వ హయాంలో రైతులను అడుగడుగున మోసం చేశారన్నారు. రైతు భరోసా నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో రైతులను జగన్ ఇబ్బంది పెట్టాడని, అటువంటి జగన్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ రూట్లో టీజీఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్! బస్సు టికెట్లపై భారీ రాయితీలు!

 

జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని, అన్ని విధాల జగన్ తిరస్కరణకు గురయ్యారు కాబట్టే ప్రజలు 11సీట్లు ఇచ్చి అధికారం నుంచి దూరం చేశారని తెలిపారు. పోలీసులను బట్టలూడదీసి కొడతామని జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మంత్రి బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. సప్త సముద్రాలు దాటి వచ్చి అయినా అన్యాయం చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతామని జగన్ చేసిన వ్యాఖ్యల పైన మండిపడ్డారు. సప్త సముద్రాలు జగన్ దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, ఆయనకు ఆ శక్తి లేదని జగన్ పని అయిపోయిందని మంత్రి పేర్కొన్నారు. జగన్ కు మళ్ళీ అధికారం అందని ద్రాక్ష అంటూ మంత్రి బాల వీరాంజనేయ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జగన్ ను ఆయన అనుచరులను కేసు పెట్టి జైలుకు పంపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #APNews #Ministerbalaveeranjaneyasawmi #Jagan #Comments