Header Banner

జగన్ ఇంటి వద్ద క్లూస్ టీమ్.. అగ్ని ప్రమాద ఘటనపై విచారణ! వారిపై అనుమానం వ్యక్తం!

  Mon Feb 10, 2025 12:26        Politics

తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ ఇంటి ఎదుట ఎండిన గ్రీనరీ తగలబడిన ఘటనలో పోలీసులకు వైసీపీ కార్యాలయ ప్రతినిధుల నుంచి ఆదివారం వరకు సీసీటీవీ ఫుటేజ్‌ అందలేదు. ఈ నెల 5న ఘటన జరగ్గా.. 6న సోషల్‌ మీడియా సహా వైసీపీ అనుకూల ప్రసారమాధ్యమాల్లో మాజీ సీఎం ఇంటి వద్ద భద్రతా లోపం అంటూ వార్తలు హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి ఫిర్యాదు మేరకు 7న తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఫిర్యాదుదారుడికి తెలిపి, వైసీపీ కార్యాలయానికి నోటీసులు అందించారు. అదేరోజు ఫోరెన్సిక్‌ బృందం, గుంటూరు జిల్లా క్లూస్‌ టీమ్‌.. ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించి ల్యాబ్‌కు పంపింది. సీసీ టీవీ ఫుటేజ్‌ విషయమై నోటీసులు ఇచ్చి రెండు రోజులు గడిచినా వైసీపీ నాయకులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఇది కూడా చదవండి: ప్రజలకు కీలక అప్డేట్.. ఏపీలో మీకు భూమి ఉందా.! వెంటనే ఇలా చెయ్యండి, లేదంటే.. రద్దవ్వగలదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం! నలుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు!

 

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi # AndhraPradesh #APNews #LatestNews #Jagan #VizagHouse #YCP #Tadepalli #JaganHouse